ఓటీటీలో హిట్‌ సిరీస్‌.. తెలుగు వర్షన్‌ విడుదల | Gyaarah Gyaarah Web Series Telugu Ott Now | Sakshi
Sakshi News home page

ఓటీటీలో హిట్‌ సిరీస్‌.. తెలుగు వర్షన్‌ విడుదల

Sep 20 2024 4:12 PM | Updated on Sep 20 2024 4:58 PM

Gyaarah Gyaarah Web Series Telugu Ott Now

'గ్యారా గ్యారా' సిరీస్ ఇప్పటికే జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍ అవుతుంది. అయితే తాజాగా తెలుగు వర్షన్‌ కూడా అందుబాటులోకి వచ్చేసింది.  ఫ్యాంటసీ థ్రిల్లర్ సిరీస్‌గా తెరకెక్కిన మూవీకి మంచి ఆధరణ లభించింది. ఈ క్రమంలో  జీ5 ఓటీటీలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.

కొరియన్ డ్రామా హిట్‌ సినిమా 'సిగ్నల్' స్ఫూర్తితో గ్యారా గ్యారా వెబ్ సిరీస్ నిర్మించారు. హిందీలో ఈ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 9 నుంచి జీ5 ఓటీటీలో హిందీ వర్షన్‌ మాత్రమే స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే, తాజాగా సెప్టెంబర్‌ 20 నుంచి తెలుగు, తమిళ్‌ వర్షన్‌లో  ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

ధర్మ ప్రొడక్షన్స్, సిఖియా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన 'గ్యారా గ్యారా' వెబ్ సిరీస్‌ను ఉమేష్ బిస్త్ డైరెక్ట్ చేశారు. ఇందులో కృతికా కామ్రా, రాఘవ్ జుయల్, ధైర్య కార్వా, ఆకాశ్ దీక్షిత్ నటించారు. 8 ఎపిసోడ్లతో విడుదలైన  ఈ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠతతో సాగుతుందని ప్రేక్షకుల నుంచి ఆధరణ లభిస్తుంది. ఇక నుంచి తెలుగు వర్షన్‌ గ్యారా గ్యారా చూసేయండి.
 

Advertisement
 
Advertisement
Advertisement