మసాలా రెడీ

Guntur Kaaram First Single Dum Masala Promo Out Now - Sakshi

హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో  రూపొందుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘దమ్‌ మసాలా’ సాంగ్‌ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్‌.

ఈ పాట పూర్తి లిరికల్‌ వీడియోను ఈ నెల 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top