గౌతమ్‌ క్యాప్షన్‌కు ఇంప్రెస్‌ అయిన 'చందమామ' | Gautam Kitchlu Says One Month Down And Forever To Go | Sakshi
Sakshi News home page

వన్‌మంత్‌  కంప్లీట్‌ చేసుకున్న కాజల్‌ జంట

Dec 1 2020 12:24 PM | Updated on Dec 1 2020 1:01 PM

Gautam Kitchlu Says One Month Down And Forever To Go - Sakshi

నూతన వధూవరులు కాజల్‌ అగర్వాల్‌, గౌతమ్‌ కిచ్లులు వన్‌మంత్‌ యానివర్సిరీని జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను గౌతమ్‌ కిచ్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఒక నెల గడిచింది..కానీ జీవితాంతం ఇలాంటివి ఇంకెన్నో  జరుపుకోవాలంటూ ఇద్దరూ ఒకరిపై ఒకరు చేయి వేసిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. దీనికి కాజల్‌ సైతం ఫిదా అయ్యి హార్ట్‌ సింబల్‌తో తన ప్రేమను వ్యక్తపరిచింది. కాగా గత నెల అక్టోబర్‌ 30 కాజల్‌-గౌతమ్‌లు ముంబైలోని తాజ్‌ మహాల్‌ ప్యాలెస్‌ హోటల్‌లో‌ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. (కాజల్‌ వెడ్డింగ్‌ లెహెంగా.. 20 మంది 30 రోజులు..) 

మూడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట పెద్దల సమక్షంలో వివాహా బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి అనంతరం వీరిద్దరూ హానీమూన్‌కు మాల్దీవులు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఐలాండ్‌ అందాలను ఆస్వాధిస్తున్న ఫొటోలను కాజల్‌ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూనే ఉన్నారు. కాగా మెగాస్టార్‌ చిరంజీవితో దర్శకుడు కొరటాల శివ రూపోందిస్తున్న‘ఆచార్య’ సినిమాలో కాజల్‌ ఫిమేల్‌ లీడ్‌ రోల్‌ చేస్తుంది. ఇటీవల షూటింగ్‌లు పున: ప్రారంభం కావడంతో ఈ సినిమా సెట్స్‌లోకి వెళ్లింది. ప్రస్తుతం ఈ సినిమాలో హైదరాబాద్‌లో షూటింగ్‌ జరపుకుంటోంది. (కాజల్‌ అగర్వాల్‌ వెరీ వెరీ స్పెషల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement