మైక్రో ఫైనాన్స్ పేరుతో రూ.10 కోట్లు మోసం చేశారని గాయని మంగ్లీపై నమోదైన సంగతి తెలిసిందే. అయితే, కేసులో దర్శకుడు వేణు ఊడుగుల కూడా ఉన్నారంటూ కొన్ని కథనాలు వచ్చాయి. ఈ అంశంపై ఆయన తాజాగా వివరణ ఇచ్చారు. మంగ్లీ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు దర్శకుడు వేణు ఊడుగుల ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
వేణు ఊడుగుల స్పందిస్తూ..' గాయని మంగ్లీ వివాదంలో నా పేరును చేర్చుతూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. ఆ వార్తలు చూసి చాలా బాధపడ్డాను. మంగ్లీ, లాయర్ సుబ్బారావు ఇద్దరూ నాకు తెలిసిన వాళ్లు కావడంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి, బాధితులకు న్యాయం చేయాలని మాత్రమే నేను సూచించాను. ఇంతవరకే ఈ కేసులో నా పాత్ర. ఈ కేసు ఎఫ్ఐఆర్‌లో కూడా నిందితుడిగా నా పేరు ఎక్కడా లేదు.
అడ్వకేట్ సుబ్బారావు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ వేణు ఊడుగులకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పారు. పంజాగుట్ట పోలీసులు కూడా ఈ కేసుతో నాకు సంబంధం లేదని నిర్థారించారు. మీ వార్తల వల్ల ఒక వ్యక్తి పరువు, ప్రతిష్ట, కుటుంబం ప్రభావితం అవుతాయని మీడియా మిత్రులు గమనించగలరు. మీరు నాపై ఇంతకాలం చూపిన ప్రేమ, ఆదరణ నాకెంతో బలాన్నిచ్చాయి. ఇప్పుడూ అదే ప్రేమను కొనసాగిస్తారని కోరుకుంటున్నా.' అని ఆయన పేర్కొన్నారు.
I’m deeply hurt to see my name linked to the Mangli case.
I have no involvement in this issue. I only suggested a peaceful resolution as both parties are known to me.
Even in the FIR, my name is not listed as an accused. The complainant advocate Subbarao has also clarified… pic.twitter.com/gsffRWTYwi— v e n u u d u g u l a (@venuudugulafilm) April 11, 2026


