పాపం హరీష్‌ శంకర్‌.. ఎట్టకేలకు ఒప్పుకున్నాడు | Film Director Harish Shankar Finally Accept Ustaad Bhagat Singh movie Failure | Sakshi
Sakshi News home page

పాపం హరీష్‌ శంకర్‌.. ఎట్టకేలకు ఒప్పుకున్నాడు

Apr 11 2026 6:16 PM | Updated on Apr 11 2026 6:18 PM

Film Director Harish Shankar Finally Accept Ustaad Bhagat Singh movie Failure

పాపం ప్రతాప్‌ సినిమా ట్రైలర్‌ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దర్శకుడు హరీష్‌ శంకర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హరీష్‌ దర్శకత్వంలో  పవన్ కల్యాణ్‌ నటించిన  తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'  భారీ డిజాస్టర్‌ అయినప్పటికీ, సినిమా విడుదలైన తర్వాత కూడా హరీష్ దానిని తీవ్రంగా ప్రచారం చేస్తూనే వచ్చారు. అతను వాస్తవాన్ని అంగీకరించడం లేదని  ప్రేక్షకుల నుంచి విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు. అయితే,  తిరువీర్ నటించిన 'పాపం ప్రతాప్'  సినిమా కార్యక్రమంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆశించిన స్థాయిలో ఆడలేదని ఎట్టకేలకు అంగీకరించాడు.

దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఈ వేదికపై ఇలా అన్నాడు. "ఈ కార్యక్రమానికి వస్తుండగా యాంకర స్రవంతి  నన్ను ‘పాపం హరీష్’ అని పిలిచింది. నా సినిమా (ఉస్తాద్ భగత్ సింగ్) థియేటర్లలో సరిగ్గా ఆడకపోవడం వల్లే ఆమె అలా పిలిచిందని మొదట అనుకున్నాను. ఆ తర్వాత, ఆమె అందరినీ ‘పాపం’ అనే సంబోధనతో పిలవడం మొదలుపెట్టింది. అందుకే ఫర్వాలేదని అనుకున్నాను," అని హరీష్ శంకర్  అన్నారు. అందుకు సంబంధించిన క్లిప్‌ వైరల్‌ అవుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement