Faria Abdullah : 'బిచ్చగాడు' హీరోతో జోడీ కట్టనున్న చిట్టి

జాతిరత్నాలు సినిమాతో కుర్రకారు మనసు దోచుకున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. చిట్టి పాత్రలో ఫరియా నటనకు మంచి మార్కులే పడ్డాయి. జాతిరత్నాలు తర్వాత కూడా పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ అవేవి పట్టాలెక్కలేదు. రీసెంట్‌గా బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్‌లో చిందేసిన ఫరియా ప్రస్తుతం రవితేజతో రావణాసుర అనే చిత్రంలో నటిస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ భామకు కోలీవుడ్ నుంచి పిలుపొచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. బిచ్చగాడు సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ ఆంటోనీ సరసన ఫరియా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సుసీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఫరియా పల్లెటూరి అమ్మాయిగా ఛాలెంజింగ్ రోల్‌లో కనిపించనుందట.