స్టార్ హీరోల‌కు హిట్స్ ఇచ్చిన డైరెక్ట‌ర్‌.. గుర్తుప‌ట్టారా? | Do you Guess This Tollywood Top Director Name? 2004 Old Photo With His Wife Goes Viral - Sakshi
Sakshi News home page

Guess This Top Telugu Director: టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

Feb 25 2024 7:45 PM | Updated on Feb 26 2024 9:30 AM

Do you Guess This Tollywood Top Director Name? - Sakshi

నీ ప్రేమ‌ను పొంద‌డం ఎంత మ‌ధుర‌మో.. అని రాసుకొచ్చింది. దీనికి 20 ఏళ్ల ప్ర‌యాణం అంటూ హ్యాష్‌ట్యాగ్ జ‌త చేసింది. అప్పుడు, ఇప్పుడు వీరి లుక్ చూసిన అభిమానులు..

ఈ ఫోటోలో క‌నిపిస్తున్న వ్య‌క్తి టాలీవుడ్‌లో పెద్ద డైరెక్ట‌ర్‌. అల్లు అర్జున్‌, నాగ‌చైత‌న్య‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ వంటి స్టార్ హీరోల‌తో క‌లిసి సినిమాలు తీశాడు. కొన్ని సినిమాల్లో అతిథి పాత్ర‌ల్లో కూడా క‌నిపించాడు. ఈ ఏడాది భారీ బ‌డ్జెట్ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాడు. గ‌తేడాది నిర్మాత‌గా హార‌ర్ మూవీతో హిట్ కొట్టాడు. అత‌డు మ‌రెవ‌రో కాదు.. డైరెక్ట‌ర్ సుకుమార్‌. 

నీ ప్రేమ ఎంత మ‌ధురం..
తాజాగా సుకుమార్ భార్య త‌బిత సోష‌ల్ మీడియాలో ఈ ఫోటో షేర్ చేసింది. 2004లో దిగిన ఫోటోతోపాటు ఈ ఏడాది దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. నీ ప్రేమ‌ను పొంద‌డం ఎంత మ‌ధుర‌మో.. అని రాసుకొచ్చింది. దీనికి 20 ఏళ్ల ప్ర‌యాణం అంటూ హ్యాష్‌ట్యాగ్ జ‌త చేసింది. అప్పుడు, ఇప్పుడు ఆయ‌న‌ లుక్ చూసిన అభిమానులు.. వాటే ఛేంజ్ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక‌పోతే సుకుమార్ గ‌తేడాది నిర్మించిన‌ విరూపాక్ష మూవీ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యింది. ఈ ఏడాది పుష్ప‌ 2 సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నాడు.

చ‌ద‌వండి: ఆడ‌దానికి ఎందుకు స్వాతంత్య్రం? రాత్రి 12 త‌ర్వాత ఏం ప‌ని? త‌ప్పు మ‌న‌వైపు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement