నాలానే ఉండాలనుకుంటున్నాను | Divi Vadthya Into Bigg Boss Telugu 4 | Sakshi
Sakshi News home page

నాలానే ఉండాలనుకుంటున్నాను

Sep 6 2020 3:53 AM | Updated on Sep 6 2020 3:53 AM

Divi Vadthya Into Bigg Boss Telugu 4 - Sakshi

దివీ వైద్య

‘‘బిగ్‌బాస్‌’ అనేది సూపర్‌ ప్లాట్‌ఫామ్‌. మనల్ని మనం ప్రేక్షకులకు దగ్గర చేసుకోవడానికి బెస్ట్‌ మీడియమ్‌. నాలాంటి యంగ్‌ యాక్టర్‌కు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను’’ అన్నారు దివీ వైద్య. ‘బిగ్‌బాస్‌ 4’లో ఓ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారామె. నేటి నుంచి ఈ షో ప్రారంభం కానుంది.

కార్యక్రమానికి హాజరయ్యే నాలుగు రోజుల ముందు ‘సాక్షి’తో దివీ వైద్య మాట్లాడుతూ – ‘‘ఇంజనీరింగ్‌ డిగ్రీ పూర్తయ్యాక యమ్‌టెక్‌ కూడా చేశా. సినిమా అంటే ప్యాషన్‌. నా నిర్ణయాన్ని మా కుటుంబం కూడా సపోర్ట్‌ చేసింది. మా కుటుంబంలో అమ్మా, అన్నయ్య ఇద్దరూ డాక్టర్సే. ముందు మోడలింగ్‌ చేశాను. మోడలింగ్‌ ద్వారా నా పాకెట్‌ మనీ నేనే సంపాదించుకునేదాన్ని. ‘మహర్షి’ సినిమాలో మహేశ్‌బాబుగారితో ఓ సన్నివేశంలో కనిపిస్తాను.

సందీప్‌ కిషన్‌ తాజా సినిమాలో ఆయన మరదలిగా నటించాను. కొన్ని కవర్‌ సాంగ్స్‌ చేశాను. కోవిడ్‌ వల్ల ఇవేమీ విడుదల కాలేదు. బిగ్‌బాస్‌ ఎంపిక జరుగుతుందని తెలుసుకొని ఇంటర్వ్యూకి వెళ్లాను. పలు రకాల ప్రశ్నలు అడిగారు. మూడు రోజుల తర్వాత సెలెక్ట్‌ అయ్యావని చెప్పారు. ప్రేక్షకులకు పరిచయం కాని కొత్త ఫేస్‌ నాది. నా మీద ఎలాంటి అభిప్రాయాలు ఉండవు. షోలో ఎలా కనిపిస్తానో అదే నా ఇమేజ్‌ అవుతుంది. ఫస్ట్‌ సీజన్‌ చూశాను. మిగతా సీజన్స్‌ చూడలేదు. ఓపెన్‌ మైండ్‌తోనే వెళ్తున్నాను. సింపతీ కార్డ్‌ ప్లే చేయి అని కొందరు సలహా ఇచ్చారు. కానీ నేను నాలానే ఉండాలనుకుంటున్నాను. ఫ్లోలో వెళ్లిపోతాను. ఈ షో నా కెరీర్‌కు అడ్వాంటేజ్‌ అవుతుందని నమ్ముతున్నాను. ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement