ప్రభాస్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు పంపించా: దివి

Big Boss Fame Divi Expressed About Her Love Towards Prabhas - Sakshi

సొట్ట బుగ్గ‌ల‌తో బిగ్‌బాస్ ప్రేమికుల‌ను ఆక‌ర్షించిన కంటెస్టెంటు దివి వైద్య‌. ముక్కుసూటిగా మాట్లాడే నైజం, అందంతో బిగ్‌బాస్‌ సీజన్‌-4లోతనకంటు ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది ఈ భామ. అంతకుముందు పలు సినిమాల్లో రాని గుర్తింపు బిగ్‌బాస్‌తో కైవసం చేసుకుంది. ఇక సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ యూత్‌లో మాంచి క్రేజ్‌ సంపాదించుకున్న దివి ప్రస్తుతం హీరోయిన్‌గానూ అవకాశాలు కొల్లగొడుతుంది. తాజాగా ఓ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. 

తనకు హీరో ప్రభాస్‌ అంటే ఎంతో ఇష్టమని, ఒక రకంగా చెప్పాలంటే ఆయనంటే క్రష్‌ అని చెప్పుకొచ్చింది. మిర్చి సినిమాతో ప్రభాస్‌కు ఫ్యాన్‌ అయిపోయానని, అప్పటి నుంచి ఆయనకు ఐ లవ్‌ యూ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు చేస్తుండేదాన్ని అని పేర్కొంది. అంతేకాకుండా ఒకవేళ అవకాశం వస్తే ప్రభాస్‌తో డేటింగ్‌కు వెళ్తానని,మిర్చి లాంటి అబ్బాయితో కప్పు కాఫీ తాగినా చాలని ఫ్యాన్‌ మూమెంట్స్‌ను షేర్‌ చేసుకుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top