2 వేలమంది కనుమరుగు... హీరోలే కాపాడాలి: దర్శకుడు | Directot RK Selvamani Interesting Comments At Valluvan Movie Audio Release, Deets Inside | Sakshi
Sakshi News home page

RK Selvamani: హీరోలకు వచ్చే ఆదాయంలో 10% వారికే ఇవ్వాలి

Oct 30 2025 8:37 AM | Updated on Oct 30 2025 8:55 AM

Directot RK Selvamani Interesting Comments at Valluvan Movie Audio Release

ఆరుపడై ప్రొడక్షన్స్‌ పతాకంపై శైల్‌కుమార్‌ నిర్మించిన చిత్రం వళ్లువన్‌. శంకర్‌ సారథి దర్శకత్వం వహించిన ఈ మూవీలో సేతన్‌ శీను, నటి ఆస్నా జవేరి జంటగా నటించారు. మనోబాలా, సాయిదీనా, దీప, రామచంద్రన్, మీసై రాజేంద్రన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అశ్వత్‌ సంగీతం, సురేశ్‌బాల చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించారు. 

డైరెక్టర్‌ స్పీచ్‌
ఈ కార్యక్రమంలో దర్శకుడు, ఫెఫ్సీ (దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య) అధ్యక్షుడు ఆర్‌కే.సెల్వమణి, ఆర్వీ ఉదయకుమార్, పేరరసు, కే.రాజన్‌ తదితర  సినీ ప్రముఖలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శంకర్‌ సారథి మాట్లాడుతూ.. అమాయక ప్రజలను రక్షించేందుకు డా.అంబేడ్కర్‌ చట్టాలను తీసుకొచ్చారన్నారు. అయితే చట్టాల్లోని మంచి విషయాలను మరచి, అందులోని లొసుగులను అడ్డం పెట్టుకుని దుండగులు తప్పించుకుని తిరిగే పరిస్థితి నెలకొందన్నారు. 

10 ఏళ్లలో 2500 సినిమాలు
అలా చట్టాన్ని చేతిలోకి తీసుకుని తప్పులు చేసే వారిని ఎవరు శిక్షిస్తారు? అన్న ఇతివృత్తంతో రూపొందించిన చిత్రం వళ్లువన్‌ అని చెప్పారు. ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే.సెల్వమణి మాట్లాడుతూ.. ట్రైలర్‌ చూస్తే కమర్శియల్‌ అంశాలతో కూడిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా అనిపించిందన్నారు. గత 10 ఏళ్లలో సుమారు 2,500 చిత్రాలు విడుదలయ్యాయని, వాటిలో 2వేల చిత్రాలను నిర్మిచింది చిన్న నిర్మాతలేనని పేర్కొన్నారు.

2 వేల మంది నిర్మాతలు కనుమరుగు
అలా వాళ్లే తమకు అన్నం పెడుతున్నారన్నారు. అయితే ఇన్నేళ్లుగా మొదటి చిత్రాన్ని తీసిన 2 వేల మంది నిర్మాతలు కనిపించకుండాపోయారన్నారు.  ఒక్క సంగీత దర్శకుడు కన్నుమూస్తే ఆయనకు కుటుంబానికి రాయల్టీ వస్తుందని, కానీ నిర్మాతలకు ఎలాంటి గ్యారెంటీ లేదన్నారు. అందువల్ల తమ ఉన్నతికి కారణం అయిన నిర్మాతలకు హీరోలు తమ ఆదాయంలో 5 లేదా 10 శాతం చెల్లించేలా ఒక సిస్టం తీసుకువస్తే బాగుంటుందనే అబిప్రాయాన్ని ఆర్‌కే.సెల్వమణి వ్యక్తం చేశారు.

చదవండి: ప్రేక్షకులకు గుర్తుండిపోయే చిత్రం ఇది 

Advertisement
 
Advertisement
Advertisement