రామ్ చరణే వచ్చాడు.. మీరెందుకు రారు మేడం?.. వరలక్ష‍్మిపై డైరెక్టర్‌ ఫైర్ | Director Sanjeev Megoti comments on Varalaxmi Sarathkumar | Sakshi
Sakshi News home page

Varalaxmi Sarathkumar: డబ్బులు తీసుకుని కూడా రారా?.. వరలక్ష‍్మిపై డైరెక్టర్‌ ఆగ్రహం

Jun 10 2026 7:20 PM | Updated on Jun 10 2026 8:46 PM

Director Sanjeev Megoti comments on Varalaxmi Sarathkumar

సినీ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌పై డైరెక్టర్‌ సంజీవ్‌ మేగోటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  డబ్బులు తీసుకుని సినిమా ప్రమోషన్స్‌కు రాకపోవడంపై ఆయన మండిపడ్డారు. నిర్మాతల బాధలు తనకు తెలుసని అన్నారు. ఈ బాధ ఆమెకు కూడా తెలుసన్నారు. ఆమె సరస్వతి మూవీ కోసం మూడు నెలలు డబ్బింగ్‌కు రాకుండా ఆపేశారని ఆరోపించారు.

డబ్బులు తీసుకుని ప్రెస్‌మీట్‌కు రాకపోవడమేంటని సంజీవ్ ప్రశ్నించారు. ప్రెస్‌మీట్‌కు రమ్మని నేను ఆమెను అడుక్కున్నానని దర్శకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మూవీ షూటింగ్‌కు ఆమె సహకరించారు.. కానీ ప్రమోషన్స్‌ ఎగ్గొట్టడం కరెక్ట్ కాదన్నారు. ఆమెకు షూటింగ్‌లో చేతికి గాయం అయితే కూడా మేమే కాంప్రమైజ్ అయ్యామని తెలిపారు.

రామ్ చరణ్ లాంటి పెద్ద హీరో పెద్ది మూవీ కోసం ప్రమోషన్స్‌లో పాల్గొన్నారని సంజీవ్ గుర్తు చేశారు. మీడియా ముందుకొచ్చి రామ్ చరణ్ తన సినిమాను ప్రమోట్ చేసుకున్నారని తెలిపారు. వాళ్లు చాలా గ్రేట్.. ఇటీవల సింగీతం శ్రీనివాసరావు దాదాపు 94 ఏళ్ల వయసులో తన సినిమా ప్రమోషన్ కోసం వచ్చారని అన్నారు. మీరెందుకు రారు వరలక్ష్మి శరత్‌కుమార్‌ గారు అని ఆమెను డైరెక్టర్‌ ప్రశ్నించారు. డబ్బుల కోసం మాత్రం ఆమె మేనేజర్ రోజు కాల్ చేస్తాడని.. ఆమె మాత్రం ప్రమోషన్స్‌కు రాదన్నారు. కాగా.. వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో పోలీస్ కంప్లైంట్‌ అనే మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో సందడి చేయనుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement