మృణాల్ ఠాకూర్‌ను లెజెండరి హీరోయిన్లతో పోల్చిన నాగ్‌ అశ్విన్‌ | Director Nag Ashwin Comment On Mrunal Thakur At Dacoit Movie Success Meet | Sakshi
Sakshi News home page

మృణాల్ ఠాకూర్‌ను లెజెండరి హీరోయిన్లతో పోల్చిన నాగ్‌ అశ్విన్‌

Apr 13 2026 8:00 AM | Updated on Apr 13 2026 8:47 AM

Director Nag Ashwin Comment On Mrunal Thakur At Dacoit Movie Success Meet

సీతారామం, హాయ్‌ నాన్న వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్న నటి మృణాల్ ఠాకూర్. ఆమె మరాఠీ అమ్మాయని తెలిసినప్పటికీ  అంతా  తెలుగమ్మాయిలాగే భావిస్తారు. తాజాగా ఆమెపై దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ప్రశంసలు కురిపించారు. అడివి శేష్‌తో కలిసి మృణాల్ నటించిన చిత్రం ‘డెకాయిట్‌’ భారీ సక్సెస్‌ సాధించిన విషయం తెలిసిందే.. దీంతో సినిమా విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నిర్మాత అల్లు అరవింద్‌, దర్శకులు నాగ్‌ అశ్విన్ పాల్గొన్నారు.

డెకాయిట్‌ మూవీ విజయోత్సవంలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ మృణాల్‌ ఠాకూర్‌ను ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మృణాల్‌ అద్భుతమైన నటి అందులో ఎలాంటి సందేహం లేదు. ఆమెలాంటి నటీమణులు చాలా అరుదుగా ఉంటారు. సాధారణమైన పాత్రలు చేసి నీ స్థాయిని తగ్గించుకోవద్దు. లెజెండరీ అలనాటి హీరోయిన్లు స్మిత పాటిల్, మధుబాల తరహాలో గొప్ప పాత్రలు చేయాలని కోరుకుంటాను' అని అన్నారు. అదే సమయంలో నిర్మాత సుప్రియ యార్లగడ్డను నాగ్‌ అశ్విన్‌ అభినందించారు. సుప్రియ స్కూల్‌లో తన సీనియర్ అని ఆమె ఇంత గొప్ప సినిమాని నిర్మించడం చాలా ఆనందంగా ఉందని ప్రశంసించారు.

అడివి శేష్‌ కెరీర్‌లోనే ఎక్కువ కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా డెకాయిట్‌ నిలిచింది. రెండురోజుల్లోనే ఏకంగా రూ. 28 కోట్ల గ్రాస్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ సినిమాకి కర్త, కర్మ, క్రియ నిర్మాత సుప్రియ అంటూ అడివి శేష్‌ తెలిపారు. అయితే,  మృణాల్‌ ఈ సినిమాకి మరో బలం అంటూ గుర్తుచేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement