అనిల్‌ రావిపూడి చేతుల మీదుగా ‘క‌ర‌ణ్ అర్జున్‌’ ట్రైలర్‌

Director Anil Ravipudi Launched Karan Arjun Movie Trailer - Sakshi

అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం ‘క‌ర‌ణ్ అర్జున్‌’. మోహ‌న్ శ్రీవ‌త్స ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ట్రైలర్‌ గురువారం విడుదలైంది. ప్రముఖ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి తాగా మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ..  ‘‘క‌ర‌ణ్ అర్జున్‌’ ట్రైల‌ర్ చాలా బాగుంది. విజువ‌ల్స్ చాలా ప్రామిసింగ్‌గా ఉన్నాయి.  ఒక యంగ్ టీమ్ ఎంతో రిస్క్ చేసి పాకిస్థాన్ బార్డ‌ర్‌లో షూటింగ్ చేశారు. ట్రైల‌ర్ లాగే సినిమా కూడా బాగుటుంద‌ని ఆశిస్తూ... టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

అనంతరం చిత్ర ద‌ర్శ‌కుడు మోహ‌న్ శ్రీవ‌త్స మాట్లాడుతూ... ‘‘ఎఫ్ 3 ప్ర‌మోష‌న్స్ లో బిజీ గా ఉన్నా కూడా మాకు టైమ్ ఇచ్చి మా క‌ర‌ణ్ అర్జున్ మూవీ ట్రైల‌ర్ లాంచ్ చేసిన అనిల్ రావిపూడి గారికి  ధ‌న్య‌వాదాలు. ట్రైల‌ర్ లో విజువ‌ల్స్, లొకేష‌న్స్ బావున్నాయంటూ  అనిల్ రావిపూడి గారు ప్ర‌త్యేకంగా చెప్ప‌డంతో పాటు మా టీమ్ అంద‌రినీ  మెచ్చుకోవ‌డం మాకెంతో ఉత్సాహాన్నిచ్చింది.  మూడు పాత్ర‌ల‌తో రోడ్ థ్రిల్ల‌ర్ గా ఈ చిత్రాన్నితెర‌కెక్కించాం. పాకిస్థాన్ బార్డర్‌లో ఎంతో రిస్క్ చేసి షూటింగ్ చేశాం. ప్ర‌తి స‌న్నివేశం ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఉంటూ థియేట‌ర్‌లో ఆడియ‌న్స్‌ని ఎంట‌ర్‌టైన్‌ చేస్తుంది. కంటెంట్‌ని న‌మ్ముకుని చేసిన సినిమా ఇది’’ అన్నారు. కాగా రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్ ప‌తాకంపై డా. సోమేశ్వరరావు పొన్నాన, బాలక్రిష్ణ ఆకుల నిర్మించిన ఈ సినిమాకు రోషన్‌ సాలూరి సంగీతం అందించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top