హెబ్బా పటేల్‌ 'అలా నిన్ను చేరి' మోషన్‌ పోస్టర్‌ వచ్చేసింది | Dinesh Tej, Hebah Patel Starrer Ala Ninnu Cheri Motion Poster Released | Sakshi
Sakshi News home page

Ala Ninnu Cheri: హెబ్బా పటేల్‌ కొత్త సినిమా మోషన్‌ పోస్టర్‌ చూశారా?

Jan 2 2023 7:22 PM | Updated on Jan 2 2023 7:22 PM

Dinesh Tej, Hebah Patel Starrer Ala Ninnu Cheri Motion Poster Released - Sakshi

పోస్టర్ చూస్తుంటే పల్లెటూరు నుంచి కెరీర్ కోసం సిటీకి చేరిన కుర్రాడు.. అమ్మాయి ప్రేమలో పడి తన జర్నీ ఎలా సాగించాడనేదే సినిమా కథ అని తెలుస్తోంది. ‘అలా

దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం అలా నిన్ను చేరి. హుషారు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న హీరో దినేష్ తేజ్ మరోసారి ఈ విలక్షణ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ కూడా షురూ చేసి నూతన సంవత్సర కానుకగా అలా నిన్ను చేరి టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టైటిల్ లోగో పోస్టర్‌ని చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఓ పక్క పల్లెటూరు, మరోపక్క మెట్రో సిటీ.. ఈ రెండు ప్రదేశాలను కలుపుతూ హీరోని బ్యాక్ నుంచి చూపించారు. పోస్టర్ చూస్తుంటే పల్లెటూరు నుంచి కెరీర్ కోసం సిటీకి చేరిన కుర్రాడు.. అమ్మాయి ప్రేమలో పడి తన జర్నీ ఎలా సాగించాడనేదే సినిమా కథ అని తెలుస్తోంది. ‘అలా నిన్ను చేరి’ సినిమాకు పాటలు చంద్రబోస్, సంగీతం సుభాష్ ఆనంద్ అందిస్తుండగా.. ఆండ్రూ కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్‌గా విఠల్, ఎడిటర్‌గా కోటగిరి వెంకటేశ్వరరావు పని చేస్తున్నారు.

చదవండి: ఎయిట్‌ ప్యాక్‌తో దర్శనమిచ్చిన హృతిక్‌ రోషన్‌, ఫోటోలు వైరల్‌
సంపూర్ణేశ్‌కు రూ.25 లక్షలు ఫైన్‌, తారక్‌ ఏం చేశారంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement