దురంధర్‌-2 క్లైమాక్స్.. ఏకంగా 500 లీటర్ల పెట్రోల్..! | Dhurandhar 2 Cilmax Scenes Created with real Petrol no doop in this scene | Sakshi
Sakshi News home page

Dhurandhar 2 Movie: దురంధర్‌-2 క్లైమాక్స్.. ఏకంగా 500 లీటర్ల పెట్రోల్..!

Apr 29 2026 7:19 PM | Updated on Apr 29 2026 7:51 PM

Dhurandhar 2 Cilmax Scenes Created with real Petrol no doop in this scene

రణ్‌వీర్ సింగ్‌ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ దురంధర్‌-2. మార్చి 19న వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన దురంధర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు.  ఈ మూవీ మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో ఈ చిత్రాలు ఏకంగా రూ.3 వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాయి. 

అయితే ఈ మూవీ క్లైమాక్స్‌ సీన్స్‌ మాస్ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించాయి. బాంబు పేలుళ్లు, తుపాకీ కాల్పుల మోతతో క్లైమాక్స్ సీన్స్‌ రణరంగాన్ని తలపించాయి. అయితే భారీ క్లైమాక్స్‌ సీక్వెన్స్‌ కోసం ఎలాంటి గ్రాఫిక్స్ వాడలేదని స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌వైజర్‌ విశాల్‌ త్యాగి వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన.. ఈ సన్నివేశాల కోసం దాదాపు 500 లీటర్ల పెట్రోల్‌ వినియోగించామని పేర్కొన్నారు.

ఫైర్‌తో కూడిన సన్నివేశాల కోసం గ్రాఫిక్స్‌ వద్దని ఆదిత్య ధర్ తమకు ముందుగానే చెప్పాడని తెలిపారు.  ఆయన చెప్పినట్లుగానే ఆ సీన్స్‌ అన్నీ రియల్‌గా చేశామన్నారు. చివర్లో వచ్చే బ్లాస్ట్‌ను రూపొందించడం చాలా కష్టంగా చేశామని వెల్లడించారు. రణ్‌వీర్‌  భద్రత విషయంలో ఆందోళన పడ్డామని.. 500 లీటర్ల పెట్రోల్‌తో షూటింగ్‌ అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండని అన్నారు.

విశాల్‌ త్యాగి మాట్లాడతూ..' క్లైమాక్స్ సీన్‌కు పక్కా ప్రణాళికతో ఉన్నాం.  రణ్‌వీర్‌కు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా చూసుకున్నాం. మొదట 250 లీటర్ల ఇంధనమే వాడాలని ప్రొడక్షన్‌ టీమ్‌ చెప్పింది. కానీ  500 లీటర్లు ఉంటేనే అవుట్‌పుట్‌ బాగా వస్తుందని చెప్పాం.  దీంతోపాటు 25 కేజీల పేలుడు పదార్థాలు వాడాం. షూటింగ్‌ పూర్తయ్యాక.. అద్భుతమంటూ నన్ను, టీమ్‌ని రణ్‌వీర్‌ అభినందించారు' అని అన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement