
నాగార్జున, ధనుశ్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం కుబేర. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. ట్రాన్స్ ఆఫ్ కుబేర పేరుతో టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి. హీరో ధనుష్ కుబేరలో సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 20న థియేటర్లలో సందడి చేయనుంది.