దర్శకుడిగా ధనరాజ్‌.. ఎమోషనల్‌ ట్రైలర్‌ చూశారా? | Sakshi
Sakshi News home page

డైరెక్టర్‌గా మారిన కమెడియన్‌ ధనరాజ్‌.. సినిమా ట్రైలర్‌ చూశారా?

Published Wed, Feb 14 2024 7:13 PM

Dhanraj, Samuthirakani Ramam Raghavam Movie Glimpse Release - Sakshi

స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం "రామం రాఘవం". నటుడు ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా రామం రాఘవం చిత్ర గ్లింప్స్‌ను హీరో ఉస్తాద్ రామ్ పోతినేని తన ట్విటర్‌ ఖాతాలో రిలీజ్‌ చేశారు.

అలాగే ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ మీడియా గ్లింప్స్‌ను రిలీజ్ చేసిన అనంతరం మాట్లాడుతూ... ధనరాజ్ నటుడిగా బిజీగా ఉన్నా.. ఒక మంచి కథను ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో రామం రాఘవం సినిమా తీశారు. గ్లింప్స్‌ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. ఎమోషనల్ జర్నీతో రాబోతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ప్రేమికుల రోజున తండ్రీ కొడుకుల మధ్య ఉన్న బాండింగ్‌ను కళ్లకు కట్టినట్లు చిత్రీకరించి గ్లింప్స్‌ విడుదల చెయ్యడం కొత్తగా ఉందని అభిప్రాయపడ్డారు.

ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య, పృద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి విమానం దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథను సమకూర్చగా అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. దుర్గా ప్రసాద్ ఈ సినిమాకు కెమెరామెన్. ఇందులోని పాటలను రామజోగయ్య శాస్త్రి రాస్తున్నారు హైదరాబాద్, అమలా పురం, రాజమండ్రి, రాజోలు, చెన్నై పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న 'రామం రాఘవం' తమిళ, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల కానుంది.

చదవండి: Tillu Square Trailer: సిద్ధు, అనుపమ​ 'టిల్లు స్క్వేర్‌' ట్రైలర్‌ వచ్చేసింది

- పోడూరి నాగ ఆంజనేయులు

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement