Dhamaka Telugu Movie Twitter Review - Sakshi
Sakshi News home page

Dhamaka Twitter Review: ‘ధమాకా’ టాక్‌ ఎలా ఉందంటే..

Dec 23 2022 7:19 AM | Updated on Dec 23 2022 10:53 AM

Dhamaka Movie Twitter Review - Sakshi

మాస్ మహారాజా రవి తేజ  డబల్ రోల్ పోషించిన తాజా చిత్రం ధమాకా. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై  టీజీ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు(డిసెంబర్‌ 23)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  

ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ధమాకా’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. 

ఫస్టాఫ్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. వింటేజ్‌ రవితేజను మరోసారి చూడబోతున్నాం. ఇంటర్వెల్‌ సీన్‌ కూడా బాగుంది అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ‘పక్కా మాస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. మంచి సినిమా. రవితేజ యాక్టింగ్‌ బాగుంది’అని ఓ వ్యక్తి ట్వీట్‌ చేశాడు.

ధమాకా ఓవరాల్‌గా రొటీన్ , అవుట్‌డేటెడ్ మూవీ. సినిమాలో కొన్ని వినోదాత్మక సన్నివేశాలు అలరిస్తాయి. సంగీతం బాగుంది. కానీ మిగిలినవి చాలా ఫ్లాట్‌గా పడిపోతాయి . పదేళ్లకు పైగా నాటి సినిమాని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 

Advertisement
 
Advertisement
Advertisement