అందుకేనేమో ఎర్ర సముద్రం అంటారు! | Sakshi
Sakshi News home page

అందుకేనేమో ఎర్ర సముద్రం అంటారు!

Published Tue, Jan 9 2024 12:07 AM

Devara First Glimpse: Jr NTR Adventures In A Sea Of Blood - Sakshi

‘జనతా గ్యారేజ్‌’ (2016) వంటి హిట్‌ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్‌–డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘దేవర’. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. కల్యాణ్‌ రామ్‌ సమర్పణలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్నారు.

రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం తొలి భాగం ‘దేవర పార్ట్‌ 1’ ఏప్రిల్‌ 5న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. కాగా ఈ సినిమా గ్లింప్స్‌ను ఆయా భాషల్లో సోమవారం విడుదల చేశారు మేకర్స్‌. ‘ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ సూసుండాది.. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్‌తో గ్లింప్స్‌ రిలీజైంది.

‘‘దేవర’ సినిమా కోసం ఎన్టీఆర్‌ అభిమానులతో పాటు ప్రేక్షకులు, ట్రేడ్‌ వర్గాలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్, కెమెరా: రత్నవేలు.

 
Advertisement
 
Advertisement