టాలీవుడ్ హీరో నాగ చైతన్యకు బిగ్ రిలీఫ్ | Delhi high Court Gives Strict Orders On Naga chaitanya Personality rights | Sakshi
Sakshi News home page

Naga Chaitanya: హీరో నాగ చైతన్యకు బిగ్ రిలీఫ్

May 29 2026 7:02 PM | Updated on May 29 2026 7:32 PM

Delhi high Court Gives Strict Orders On Naga chaitanya Personality rights

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ఢిల్లీ హైకోర్ట్‌లో బిగ్ రిలీఫ్ లభించింది. వ్యక్తిగత గోప్యతను కాపాడాలంటూ పిటిషన్ వేయగా.. చైతుకు అనుకూలంగా కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును విచారించిన జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం..నాగచైతన్యకు అనుకూలంగా రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో సంబంధిత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

 కాగా.. పలు అశ్లీల వెబ్‌సైట్‌లు, కొన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో నాగచైతన్య పేరు, ఫోటోలను అనుమతి లేకుండా వాడుతున్నారని సీనియర్ లాయర్ వైభవ్ గగ్గర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నాగచైతన్య పోలికలతో ఉన్న అనధికారిక వస్తువుల విక్రయం, ఏఐ-జనరేటెడ్ కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో విచ్చలవిడిగా వాడుతున్నారని ధర్మాసనానికి వివరించారు. నాగచైతన్య వ్యక్తిగత జీవితం, పరువుకు భంగం కలిగించేలా సాగుతున్న పోస్టులపై  ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై అనుమతి లేకుండా నాగచైతన్య పేరు, వాయిస్, ఫొటోలు ఉపయోగించరాదని ఆదేశాలు జారీ చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement