శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, రాధ్య, అదితి భావరాజు ప్రధానపాత్రల్లో నటించిన సినిమా ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో ముప్పనేని శ్రీలక్ష్మీ సమర్పణలో లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 25న రిలీజ్ కానుంది. ‘దండోరా’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ– ‘‘మన సమాజంలోని కుల వ్యవస్థ మీద సెటైరికల్‌గా అద్భుతమైన కథను రాసుకున్నారు మురళీగారు.
తమిళ్, మలయాళీ ఆర్టిస్టులే బాగా నటిస్తారనుకునే వారికి ‘దండోరా’ చూస్తే.. అంతకంటే గొప్ప ఆర్టిస్టులు తెలుగులో ఉన్నారని అర్థం అవుతుంది’’ అని చెప్పారు. ‘‘చావు, కులం అనేపాయింట్స్‌తో మంచి విషయాల్ని ఈ సినిమాలో చెప్పారు మురళిగారు’’ అన్నారు నవదీప్. ‘‘సమాజంలో ఆలోచనలు రేకెత్తించేలా మా ‘దండోరా’ ఉంటుంది’’ అని బిందు మాధవి పేర్కొన్నారు. ‘‘మా సినిమా అలరించేలా ఉంటుంది’’ అని అన్నారు రవీంద్ర బెనర్జీ ముప్పనేని. ‘‘దండోరా’ టీజర్ చూసి అల్లు అర్జున్‌గారు అభినందించారు. అదే మాకు పెద్ద సక్సెస్’’ అని మురళీకాంత్ చెప్పారు.


