దగ్గుబాటి కుటుంబ కేసు.. ఆ విషయంలో జాగ్రత్త..! | Daggubati Family Legal Team Gives Clarity On Rumours On Deccan Kitchen Hotel Demolition Case, More Details Inside | Sakshi
Sakshi News home page

Daggubati Family Case: దగ్గుబాటి కుటుంబ కేసు.. లీగల్ టీమ్‌ క్లారిటీ

Mar 26 2026 2:27 PM | Updated on Mar 26 2026 2:48 PM

Daggubati Family Legal Team Clarity  news on case issue

దగ్గుబాటి కుటుంబానికి సంబంధించిన కేసు  విచారణ ఇంకా కొనసాగుతోంది. దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ కూల్చివేత కేసు విచారణ ఏప్రిల్ 10కి కోర్టు వాయిదా వేశారని దగ్గుబాటి కుటుంబం లీగల్ టీమ్ తెలిపింది. గతంలో మాదిరిగానే రాబోయే విచారణకు దగ్గుబాటి కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టంగా చేసిందని వెల్లడించింది.

అయితే విచారణ సమయంలో  నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేయలేదని లీగల్ టీమ్ పేర్కొంది. దీనికి విరుద్ధంగా ప్రత్యర్థులు,కొన్ని వర్గాలు చేసే ప్రచారం పూర్తిగా అసత్యం, తప్పుదోవ పట్టించేవని తెలియజేసింది. ఈ కేసుకు సంబంధించి మీడియా సంస్థలు ఏవైనా వార్తలు ప్రచురించే ముందు కోర్టు ఆదేశాలను పరిశీలించడం, దగ్గుబాటి కుటుంబం న్యాయ సలహాదారుని సంప్రదించి ప్రచురించాలని లీగల్ టీమ్ విజ్ఞప్తి చేసింది.

అసలు కేసు ఏంటంటే..?

గతంలో సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్‌ కుటుంబ సభ్యులపై ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది. ఫిలింనగర్‌ రోడ్డునెంబర్‌–1లో ఉన్న దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ కూల్చివేత వ్యవహారంలో బాధితుడు నందకుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో పోలీసులు నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు (ఏ1), దగ్గుబాటి వెంకటేష్‌ (ఏ2), దగ్గుబాటి రానా (ఏ3), దగ్గుబాటి అభిరామ్‌ (ఏ4)లపై  కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

2022 నవంబర్‌లో దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ను జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. నందకుమార్‌కు చెందిన దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ అంశంలో దగ్గుబాటి కుటుంబంతో స్థల వివాదం ఉంది. నందకుమార్‌ సిటీ సివిల్‌ కోర్టులో కేసు కూడా వేశారు. ఈ అంశంలో స్టేటస్‌ కో కొనసాగించాలని.. ఆ స్థలంలో ఎలాంటి చర్యలకు దిగవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు బేఖాతరు చేస్తూ గతేడాది జవనరిలో దగ్గుబాటి కుటుంబం హోటల్‌ను పూర్తిగా నేలమట్టం చేసింది. దీంతో మరోసారి బాధితుడు నందకుమార్‌ దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కోర్టు ఆదేశాల ఉల్లంఘన కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన నాంపల్లి న్యాయస్థానం ఈ ఘటనలో కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ ఫిలింనగర్‌ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement