Rakul Preet Singh Believes Cinema Is Not Language, Cinema Is Emotion - Sakshi
Sakshi News home page

Rakul Preet Singh: సౌత్‌, నార్త్‌ రెండూ కలిస్తే అద్భుతాలే..

May 27 2022 7:55 AM | Updated on May 27 2022 8:35 AM

Cinema Is Emotion, Rakul Preet Singh About Pan Indian Movies - Sakshi

పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కావడంవల్ల థియేటర్లలో చూసి ఆనందిస్తున్నారు. ప్రస్తుతం ఒక సినిమా పలు భాషల్లో విడుదలవుతోంది కాబట్టి అందరూ చూసే వీలు ఉంటోంది. అందుకే ఇప్పుడు సినిమాకి భాష లేదు.. సినిమా అంటే ఎమోషన్‌

‘‘ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమా అని మాట్లాడుకుంటున్నాం. అయితే ఇంతకుముందు దక్షిణాది సినిమాలు హిందీలో అనువాదమై, టీవీల్లో వచ్చేవి. వాటిని ప్రేక్షకులు ఎంజాయ్‌ చేశారు. ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కావడంవల్ల థియేటర్లలో చూసి ఆనందిస్తున్నారు. ప్రస్తుతం ఒక సినిమా పలు భాషల్లో విడుదలవుతోంది కాబట్టి అందరూ చూసే వీలు ఉంటోంది. అందుకే ఇప్పుడు సినిమాకి భాష లేదు.. సినిమా అంటే ఎమోషన్‌’’ అన్నారు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

దక్షిణాది సినిమాలు ఇతర భాషల్లో అభినందనలు పొందడం గురించి రకుల్‌ ఈ విధంగా అన్నారు. సౌత్‌.. నార్త్‌ రెండూ కలిస్తే ఇంకా అద్భుతాలు చేయొచ్చని కూడా ఈ బ్యూటీ అన్నారు. ఇదిలా ఉంటే.. స్టార్‌ హీరోయిన్లు కొందరు వెబ్‌ సిరీస్‌లు కూడా చేస్తున్నారు. మరి.. మీ ఓటీటీ ఎంట్రీ ఎప్పుడు? అనే ప్రశ్న రకుల్‌ ముందుంచితే – ‘‘ఎగ్జయిటింగ్‌ ప్రాజెక్ట్‌ వస్తే తప్పకుండా చేస్తా. ఓటీటీలో కూడా మంచి కంటెంట్‌ వస్తోంది’’ అన్నారు.

చదవండి 👇
సింగర్‌ దారుణ హత్య, ప్రాణాలు తీసే ముందు 10 నిద్ర మాత్రలు
లవర్స్‌తో వచ్చిన మాజీ హృతిక్‌ దంపతులు, ఫొటోలు వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement