రామ్‌ చరణ్‌ కంటికి సర్జరీ.. చిరంజీవి ట్వీట్‌ వైరల్‌ | Chiranjeevi Thanks To Doctor Who Surgery For Ram Charan Eye, Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

రామ్‌ చరణ్‌ కంటికి సర్జరీ.. చిరంజీవి ట్వీట్‌ వైరల్‌

Mar 26 2026 2:02 PM | Updated on Mar 26 2026 2:10 PM

Chiranjeevi Thanks To Doctor Who Surgery For Ram Charan Eye, Tweet Goes Viral

‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో రామ్‌ చరణ్‌ గాయపడిన సంగతి తెలిసిందే. ఓ హై ఇంటెన్సిటీ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తుండగా జరిగిన ప్రమాదంలో రామ్‌ చరణ్‌ ఎడమ కంటికి స్వల్ప గాయం అయింది.  దీంతో షూటింగ్‌కి బ్రేక్‌ ఇచ్చి ఆస్పత్రికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా చరణ్‌కి కంటికి చిన్న సర్జరీ చేశారట. ఈ విషయాన్ని మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియా ద్వారా వెల్లడిస్తూ.. సర్జరీ చేసిన డాక్టర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. 

‘డాక్టర్ సుధాకర్ ప్రసాద్ గారు,చరణ్ కనురెప్పకు మీరు ఎంతో నైపుణ్యంతో సర్జరీ చేసినందుకు ధన్యవాదాలు. తొలుత మాకు కొంత ఆందోళన కలిగినప్పటికీ.. మీరు చెప్పిన మాటలు మా భయాన్ని పోగొట్టి, ధైర్యాన్ని ఇచ్చాయి. సకాలంలో స్పందించి, శస్త్రచికిత్స అందించినందుకు కృతజ్ఞతలు’ అని చిరంజీవి చేసిన ట్వీట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ వార్త తెలుసుకున్న మెగా అభిమానులు.. రామ్‌ చరణ్‌ త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. 

పెద్ది విషయానికొస్తే.. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 30న విడుదల కానుంది. ఈ నెల 27న రామ్‌ చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా ‘పెద్ది’ గ్లింప్స్‌ని రిలీజ్‌ కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement