మరి అన్నయ్యంటే ఏమనుకున్నారు.. తన ప్రేమ అమృతం! | Chiranjeevi Celebrates Hero Srikanth Birthday In His House, Photos Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Chiranjeevi-Srikanth Viral Photos: శ్రీకాంత్‌ ఇంటికెళ్లి మరీ కేక్‌ కట్‌ చేయించిన మెగాస్టార్‌

Published Sat, Mar 23 2024 9:53 PM | Last Updated on Sun, Mar 24 2024 5:49 PM

Chiranjeevi Celebrates Hero Srikanth Birthday, See Photos - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవికి అంతటా అభిమానులే! ఇండస్ట్రీలో కూడా ఆయన్ను ఆరాధించేవారు ఎంతోమంది! వారిలో హీరో శ్రీకాంత్‌ ఒకరు. మెగాస్టార్‌ను అన్నయ్య అని పిలుస్తూ ఉంటాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌, శంకర్‌దాదా జిందాబాద్‌ చిత్రాలు ఎంతలా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యాయో అందరికీ తెలిసిందే! ఈ సినిమాల తర్వాత ఈ అన్నదమ్ములు మరింత క్లోజయ్యారు.

ఈరోజు(మార్చి 23న) శ్రీకాంత్‌ బర్త్‌డే.. అది గుర్తుపెట్టుకుని మరీ చిరంజీవి స్వయంగా అతడి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపాడు. అంతేనా? స్వయంగా కేక్‌ కట్‌ చేయించి తినిపించాడు. కేక్‌ మీద హ్యాపీ బర్త్‌డే శ్రీకాంత్‌.. లవ్‌ ఫ్రమ్‌ అన్నయ్య అని రాయించడం హైలైట్‌గా మారింది. తర్వాత శ్రీకాంత్‌ ఫ్యామిలీతో కాసేపు సరదాగా గడిపాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

చదవండి: హిట్‌ సినిమాల చైల్డ్‌ ఆర్టిస్ట్‌.. ఇప్పుడేంటి ఇంతందంగా మారిపోయింది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement