'జననాయగన్‌' కు చిరంజీవి సపోర్ట్‌ | Chiranjeevi and sivakarthikeyan big support to jana nayagan movie | Sakshi
Sakshi News home page

'జననాయగన్‌' కు చిరంజీవి సపోర్ట్‌

Apr 10 2026 3:32 PM | Updated on Apr 10 2026 3:39 PM

Chiranjeevi and sivakarthikeyan big support to jana nayagan movie

 విజయ్ నటించిన 'జననాయగన్‌' విడుదల కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తుండగా ఆన్‌లైన్‌లో పలు సీన్లు ప్రత్యక్షం కావడంతో అందరూ షాక్‌ అయ్యారు. ఈ చర్యపై చిరంజీవితో పాటు చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్‌, నటుడు శివకార్తికేయన్‌ ఫైర్‌ అయ్యారు.  సెన్సార్‌ సర్టిఫికెట్‌ కూడా రాని ఈ చిత్రం నుంచి సుమారు 5 నిమిషాల సీన్‌తో పాటు ఒక సాంగ్‌ను  లీక్‌ చేశారు. తమ అనుమతి లేకుండా కొందరు ఇలాంటి పనిచేయడంపై మేకర్స్‌ ఆగ్రహించారు.  మూవీ వీడియోలను షేర్‌ చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని నిర్మాణ సంస్థ హెచ్చరించింది.  ఇప్పటికే న్యాయవాదులు నోటీసులు జారీ చేశారు.

విజయ్‌ సినిమాకు అండగా చిరంజీవి 
జననాయగన్‌కు మెగాస్టార్‌ చిరంజీవి అండగా నిలిచారు. సినిమా లీక్‌ కావడం తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్నారు. ఇలాంటి చర్యలు ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. క్రియేటివ్‌ వర్క్‌కు రక్షణ అవసరమన్నారు. జననాయగన్‌కు తన మద్ధతు  ఉంటుందని చిరు భరోసా కల్పించారు. పైరసీని అరికడదాం.. సినిమా పరిశ్రమను కాపాడుకుందాం అని ఆయన పిలుపునిచ్చారు. జననాయగన్‌ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్  సంస్థ నిర్మిస్తన్న విషయం తెలిసిందే. అయితే, చిరంజీవి-బాబీ సినిమాను కూడా ఇదే సంస్థ నిర్మిస్తుండటం విశేషం.

జననాయగన్‌  మూవీకి సంబంధించిన వీడియోలు లీక్‌ కావడంపై నటుడు శివకార్తీకేయన్  ఆగ్రహం వ్యక్తం చేశారు.  సినిమాను  నిర్మించేందుకు వేలాదిమంది రక్తం, చెమట చిందిస్తారని గుర్తుపెట్టుకోవాలి. దయచేసి పైరసీకి పాల్పడకండి.  సినిమాను థియేటర్లలోనే చూసి మా కష్టాన్ని గౌరవించండి. సినిమా పైరసీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అని ఆయన కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement