చాందినీ చౌదరి, సుశాంత్ యాష్కీ లీడ్ రోల్స్‌లో సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ జానర్‌లో ఓ సినిమా ఆరంభమైంది. వికాస్ దర్శకత్వంలో సృజన గోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ఈ వేడుకకు అతిథిగా హాజరైన నటుడు–దర్శకుడు తరుణ్ భాస్కర్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి, ‘‘ఈ సినిమా కాన్సెప్ట్ విన్నాను. కొత్తగా ఉంది’’ అని తెలిపారు.
సృజన గోపాల్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంతో కొత్త కాన్సెప్ట్‌ని పరిచయం చేస్తున్నాం. సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ జానర్‌లో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చేలా ఉంటుంది. ఒక సూపర్ నేచురల్ ఎలిమెంట్ కూడా ఉంది. ఎవరూ ఊహించని ఒక సూపర్ హీరోని పరిచయం చేయనున్నాం’’ అని చెప్పారు.


