గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మహేశ్ సినిమా చైల్డ్ ఆర్టిస్.. ఎవరో కనిపెట్టారా? | Sakshi
Sakshi News home page

Guess The Actess: తెలుగులో ఏడు సినిమాలు చేసింది.. ఇప్పుడేమో ఏకంగా హాలీవుడ్‌లో

Published Sun, Jan 14 2024 3:50 PM

Brahmotsavam Movie Actress Avantika Vandanapu Latest Details - Sakshi

తెలుగు మూలలున్న అమ్మాయి. పుట్టిపెరిగింది అంతా అమెరికాలోనే అయినప్పటికీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మహేశ్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. పర్లేదు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడేమో సడన్‌గా హాలీవుడ్‌లో వరస మూవీస్ చేస్తూ బిజీ అవుతోంది. ఇంకా టీనేజీలోనే ఉన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు అవంతిక వందనాపు. ఈమె తల్లిదండ్రులది హైదరాబాద్. కాకపోతే కాలిఫోర్నియాలో సెటిలైపోయారు. ఆ తర్వాత 2005లో ఈమె పుట్టింది. పదేళ్ల వయసులోనే ఈమెకి తెలుగు సినిమాల్లో ఛాన్సులొచ్చాయి. నాని 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాల్లో ఓ చైల్డ్ ఆర్టిస్టుగా అవంతికనే చేయాల్సింది గానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయింది. అలా మహేశ్ 'బ్రహ్మోత్సవం' చిత్రంతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది.

(ఇదీ చదవండి: రెండో రోజుకే భారీగా తగ్గిపోయిన 'గుంటూరు కారం' కలెక్షన్స్)

మహేశ్ సినిమాలో నటించిన తర్వాత ఈమెకు వరస ఛాన్సులొచ్చాయి. మనమంతా, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, బాలకృష్ణుడు, ఆక్సిజన్, అజ్ఞాతవాసి తదితర చిత్రాల్లో పలు క్యారెక్టర్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్యలో కొన్ని యాడ్స్‌లోనూ నటించింది. వీటి తర్వాత తెలుగు చిత్రాలకు టాటా చెప్పేసిన అవంతిక.. పూర్తిగా కాలిఫోర్నియా షిఫ్ట్ అయిపోయింది. 

2020 నుంచి హాలీవుడ్‌లోనే పలు సినిమాలు, ఆల్బమ్ సాంగ్స్ లాంటివి చేస్తూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. ప్రస్తుతం ఈమె వయసు 18 ఏళ్లు. కాకపోతే లేటెస్ట్ ఫొటోలు చూస్తుంటే మాత్రం అలా కనిపించట్లేదు. అలానే చైల్డ్ ఆర్టిస్టు ఫొటోలతో పోల్చి చూస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. అందుకే ఈమెని తెలుగు ఆడియెన్స్ తొలుత గుర్తుపట్టలేకపోయారు. ఈమె ఎవరో తెలిసేసరికి అవాక్కవుతున్నారు.

(ఇదీ చదవండి: సంక్రాంతి మూవీస్.. ఆమె నటిస్తే హిట్ కొట్టడం గ్యారంటీనా?)

Advertisement
 
Advertisement
 
Advertisement