అజిత్‌ ఇంట్లో బాంబు కాల్‌ కలకలం

Bomb Threat To Thala Ajiths Residence - Sakshi

చెన్నై : తమిళ స్టార్‌ హీరో అజిత్‌ ఇంట్లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్‌ కాల్‌ రావడం కలకం రేపింది. వివరాల ప్రకారం.. హీరో అజిత్‌ కుటుంబం ప్రస్తుతం చెన్నైలోని తిరువాన్మియూరులో నివాస‌ముంటున్నారు. అయితే మంగళవారం అజిత్‌ ఇంట్లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్‌ వచ్చింది. దీంతో ఈ విషయాన్ని అజిత్‌ కుటుంబ స‌భ్యులు వెంటనే  పోలీసుల‌కు తెలియ‌జేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.

జాగిలాల‌తో ఇల్లు మొత్తం త‌నిఖీ చేసిన పోలీసులు ఇంట్లో ఎలాంటి బాంబు లేద‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. ఇది ఎవరో ఆకతాయిలు చేసిన పనిగా పోలీసులు గుర్తించారు. ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ ఆయన ఇంట్లో బాంబు పెట్టినట్లు ఓ ఆకతాయి ఫోన్‌ చేసిన విషయం తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్ర‌స్తుతం ఆయన ‘వాలిమై’ అనే చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

చదవండి : ఆటోలో తిరుగుతున్న స్టార్‌ హీరో.. వీడియో వైరల్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top