అప్పుడు డిజాస్టర్.. ఇప్పుడు బ్లాక్‌బస్టర్‌.. ఇదేం విచిత్రం..! | Bollywood Movie Awarapan 2 hits Crazy Record at Box office | Sakshi
Sakshi News home page

Awarapan 2 Movie: అప్పుడు డిజాస్టర్.. ఇప్పుడు బ్లాక్‌బస్టర్‌.. ఇదేం విచిత్రం..!

Sep 1 2026 9:13 PM | Updated on Sep 1 2026 9:36 PM

Bollywood Movie Awarapan 2 hits Crazy Record at Box office

ఇటీవల బాక్సాఫీస్ వద్ద విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఇటీవల రిలీజైన టాక్సిక్‌ ఒక్క రోజుకే బాక్సాఫీస్ వద్ద కనిపించకుండా పోయింది. భారీ బడ్జెట్‌, తారాగణం ఉన్నప్పటికీ కంటెంట్ పరంగా మెప్పించలేకపోయింది. అలాంటి ఈ టైమ్‌లో ఇరుముడి సూపర్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. అంతేకాకుండా మలయాళ చిన్న సినిమా బెత్లెహమ్ ఫ్యామిలీ యూనిట్ సైతం అదరగొడుతోంది.

ఇదిలా ఉంటే ఎప్పుడో 19 ఏళ్ల క్రితం వచ్చిన మూవీకి సీక్వెల్‌గా ఆవారాపన్-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 2007లో ఇమ్రాన్‌ హష్మి, శ్రియా శరణ్‌ జంటగా ఆవారాపన్ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో ఇమ్రాన్‌ హష్మి, దిశా పటానీ జంటగా కనిపించారు. ఈ చిత్రాన్ని నితిన్‌ కక్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కించారు.

అప్పట్లో ఫ్లాప్ అయిన సినిమా సీక్వెల్‌కు ఇప్పుడు వసూళ్లు రావడంపై బాలీవుడ్‌లో చర్చ మొదలైంది. ఆగస్టు 14న విడుదలై ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లు సాధించింది. ఈ మూవీ సూపర్‌హిట్‌గా నిలవడంపై ఇమ్రాన్‌ హష్మి ఎమోషనల్ అయ్యారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement