Urvashi Rautela Wishes: పంత్‌కు ఊర్వశి రౌతేలా స్పెషల్ విషెస్.. పోస్ట్ వైరల్..!

Bollywood Actress Urvashi Rautela Birthday Wishes On Instagram To Panth - Sakshi

గతంలో టీమిండియా  యువ వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్, బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా మధ్య వివాదం కొనసాగిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆమె అతనికి సారీ కూడా చెప్పింది. అయితే తాజాగా పంత్ ‍బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె ఓ వీడియో షేర్‌ చేసింది. తన ఇన్‌స్టాలో 'హ్యాపీ బర్త్‌డే' అంటూ ఎవరీ పేరు చెప్పకుండానే పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ కాస్తా వైరలవడంతో అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇవాళ పంత్‌ బర్త్‌డే కావడంతో అతనికే విషెస్ చెప్పారంటూ ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

(చదవండి: Rishabh Pant: లైట్‌ తీసుకున్న పంత్‌.. సారీ చెప్పిన ఊర్వశి.. వీడియో వైరల్‌!)

ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఆ వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. రెడ్‌ కలర్‌ డ్రెస్‌లో ఆమె నవ్వుతూ ఫ్లయింగ్ కిస్ ఇస్తున్న వీడియో ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అందులోనే పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చింది ఈ బాలీవుడ్ భామ. ఆమె ఎవరికీ చెప్పిందో పేరును ప్రస్తావించనప్పటికీ నెటిజన్లు మాత్రం ఆ వీడియో రిషభ్ పంత్ కోసమేనని కామెంట్స్‌ చేస్తున్నారు. ఇవాళ టీమిండియా క్రికెటర్ పంత్ తన 25వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top