Bigg Boss 6 Telugu Episode 60 Highlights:BB Secret Mission To Adi Reddy - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: సివంగిలా పోరాడిన ఆడాళ్లు, రెచ్చగొట్టే పనిలో రెడ్‌ టీమ్‌!

Published Wed, Nov 2 2022 11:59 PM

Bigg Boss Telugu: BB Secret Mission To Adi Reddy - Sakshi

Bigg Boss 6 Telugu, Episode 60: బిగ్‌బాస్‌ అంటే మైండ్‌ గేమ్‌ అని కొందరు, కాదు ఫిజికల్‌ గేమ్‌ అని మరికొందరు, ఆ రెండింటికన్నా వ్యక్తిత్వం ఇంపార్టెంట్‌ బ్రదరూ అనేవాళ్లూ ఉన్నారు. కానీ కంటెస్టెంట్లలో కచ్చితంగా ఈ మూడు క్వాలిటీస్‌ ఉండాల్సిందే! దురదృష్టం కొద్దీ ఆ విషయాన్ని గాలికొదిలేస్తున్నారు హౌస్‌మేట్స్‌. ఫిజికల్‌ గేమ్‌ వచ్చినప్పుడు మైండ్‌ గేమ్‌, మైండ్‌ గేమ్‌ వచ్చినప్పుడు ఫిజికల్‌ గేమ్‌ ఆడుతున్నారు. మరీ ముఖ్యంగా ఏదైనా టాస్క్‌ రాగానే వారి బలహీనతల మీద దెబ్బ కొట్టి రెచ్చగొట్టి పెంట చేస్తున్నారు. దీంతో గేమ్‌ స్పిరిట్‌ కంటే గొడవలే ఎక్కువైపోతున్నాయి. ఈరోజు ఎపిసోడ్‌లో కూడా అదే జరిగింది.

మిషన్‌ పాజిబుల్‌ టాస్క్‌లో భాగంగా ఇతర స్క్వాడ్‌లోని సభ్యులను చంపేందుకు క్యాప్చర్‌ ద వార్‌ అనే ఛాలెంజ్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. అయితే గ్రనైట్‌ రెడ్‌ స్క్వాట్‌ ఆధీనంలో ఉండటంతో ఎవరెవరు పోటీపడాలి? సంచాలకులుగా ఎవరు ఉండాలనేది రెడ్‌ టీమ్‌ ఎంపిక చేయొచ్చని ట్విస్ట్‌ ఇచ్చాడు. ఇంకేముంది, గీతూ సంచాలక్‌ అయింది. బ్లూ టీమ్‌లో వీక్‌గా ఉన్నారనుకున్న ఇనయ, వాసంతి, మెరీనాలు.. రేవంత్‌, శ్రీహాన్‌, ఫైమాతో పోటీపడాలని నిర్ణయించారు.

గేమ్‌ మొదలు కాకముందే ఎప్పటిలా కొత్త రూల్స్‌ పెట్టింది గీతూ. గోడ మీద నుంచి రెండు కాళ్లు కింద పెడితే అవుట్‌ అని చెప్పింది. గేమ్‌ ప్రారంభం కాగానే ముగ్గురు ఆడాళ్లు సివంగుల్లా పోట్లాడారు. వెక్కిరిస్తూ వెకిలి చేష్టలు చేసిన రేవంత్‌ను అవుట్‌ చేసింది వాసంతి. శ్రీహాన్‌ ఇనయను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తూ.. నామినేషన్‌లో తప్ప కంటెంట్‌ లేనిదానివి నువ్వు మట్లాడుతున్నావు​ అని విమర్శించాడు. దీనికి ఇనయ.. నువ్వూ ఈ మధ్య కంటెంట్‌ బాగా ఇస్తున్నావ్‌లే, ఎక్కడ వెళ్లి పడుకుంటున్నావో చూస్తున్నా అంది. ఇక ఇనయ నెట్టేసే క్రమంలో శ్రీహాన్‌ రెండు కాళ్లు కింద పెట్టినా గీతూ మాత్రం తాను చూడలేదని మాట్లాడింది. ఎవ్వరు చెప్పినా ఆమె పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ మొదటి మిషన్‌లో రెడ్‌ స్క్వాడ్‌ గెలవగా వారు బ్లూ స్క్వాడ్‌లో రోహిత్‌ను చంపారు.

తర్వాత శ్రీహాన్‌.. ఇనయ దగ్గరకు వెళ్లి నా క్యారెక్టర్‌​ గురించి ఏదో నోరు జారుతున్నావేంటి అంటూ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. మా రిలేషన్‌కు ఓ పేరుంది, లిమిట్‌ ఉంది అని ఎగబడ్డారు శ్రీసత్య, శ్రీహాన్‌. దానికి ఇనయ మీరు కింద పడుకోవడం చూశానని ఆన్సరిచ్చింది. మరోపక్క బాలాదిత్య సిగరెట్ల కోసం అల్లాడిపోయాడు. చేసింది చాలు, తప్పు చేయకు, నా మనసు విరిగిపోయింది అని సిగరెట్లు అడగ్గా గీతూ మాత్రం ఇవ్వనంటూ మొండికేసింది. నా స్టూడెంట్స్‌కు నేను సిగరెట్లు తాగడం తెలియొద్దనుకున్నా, కానీ తెలిసిపోయింది. అమ్మ చూస్తే బాధపడుతుంది అంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు ఆదిత్య.

ఆదిరెడ్డి సహా అందరూ బతిమాలడంతో చివరాఖరికి సిగరెట్లు ఇచ్చేసి ఏడ్చేసింది గీతూ. దీంతో ఆవేశంలో సిగ్గులేదు అన్నందుకు తనను క్షమించమని చేతులెత్తి వేడుకున్నాడు బాలాదిత్య. గీతూ మాత్రం అతడిని క్షమించే ప్రసక్తే లేదన్నట్లు ప్రవర్తించింది. తెల్లారి బాలాదిత్య సిగరెట్లు తాగుదామనుకునేలోపు లైటర్‌ కనిపించకుండా పోయింది. దీంతో ఆదిరెడ్డి.. బిగ్‌బాస్‌.. వీక్‌నెస్‌తో ఆడుకోమన్నాడని చెప్పి మీ బలాన్ని ప్రయోగించరా? అని కరెక్ట్‌ పాయింట్‌ లాగాడు. అటు గీతూ మాత్రం.. నేను దొంగ, వెధవెన్నర వెధవ.. జాగ్రత్తగా దాచుకోవాలని చెప్పి కాసేపు సతాయించి తర్వాత లైటర్‌ ఇచ్చేసింది.

రాత్రి నిద్రపోయేటప్పుడు ఇనయ సూర్య జ్ఞాపకాలతో తడిసి ముద్దైంది. నీ షర్ట్‌ వేసుకునే గేమ్‌ ఆడాను. ఎందుకింత గుర్తొస్తున్నావంటూ సూర్యను తలుచుకుని ముసిముసి నవ్వులు నవ్వింది. అటు శ్రీసత్య మాత్రం ఎవరు ఏ పాయింట్‌లో ట్రిగ్గర్‌ అవుతారో నాకు తెలుసు. కాబట్టి రేపు ఎదుటివాళ్లను రెచ్చగొట్టి గేమ్‌ ఆడదామని రేవంత్‌తో చెప్పుకొచ్చింది.

మరుసటి రోజు ఆదిరెడ్డిని కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్‌ అతడికి సీక్రెట్‌ మిషన్‌ ఇచ్చాడు. వాష్‌రూమ్‌ను పూర్తిగా అశుభ్రపరిచి ఆ నింద రెడ్‌ స్క్వాడ్‌లో ఒకరి మీద వేయాలన్నాడు. ఈ మిషన్‌ కంప్లీట్‌ చేస్తే బ్లూ టీమ్‌లో ఒకరిని బతికించొచ్చన్నాడు. మరి ఆ సీక్రెట్‌ మిషన్‌ పాజిబులా? ఇంపాజిబులా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్‌ కోసం వెయిట్‌ చేయాల్సిందే!

చదవండి: ఆత్మహత్య తప్ప మరో దిక్కు లేదు: పావలా శ్యామల
అందరికీ రుణపడి ఉంటా: రంభ వీడియో వైరల్‌

Advertisement
 
Advertisement
 
Advertisement