
బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్‌తో అన్ని భాషల్లో సక్సెస్‌గా కొనసాగుతోంది. ఇప్పటికే హిందీ, తెలుగు భాషల్లో ఈ రియాలిటీ షో ప్రారంభమైంది. తెలుగులో సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా మొదలైంది. ఇప్పుడు తమిళ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. అక్కడ తమిళ బిగ్‌బాస్ సీజన్-9 కావడం మరో విశేషం.
ఈ సీజన్‌ను వచ్చే నెల ఐదో తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు మేకర్స్ రివీల్ చేశారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సీజన్‌కు కూడా స్టార్ హీరో విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బుల్లితెర ప్రియులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. బిగ్‌బాస్ సీజన్ -7 తర్వాత కమల్ హాసన్ తప్పుకోవడంతో విజయ్ సేతుపతి హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ రియాలిటీ షో విజయ్ టీవీతో పాటు జియో హాట్‌స్టార్‌లోనూ స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే ఈ సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
பாக்க பாக்க தான் புரியும்.. போக போக தான் தெரியும்
Bigg Boss Tamil Season 9 | Grand Launch - அக்டோபர் 5 முதல்..😎 #BiggBossSeasonTamil9 #OnnumePuriyala #BiggBoss9 #VijaySethupathi #BiggBossTamil #BB9 #VijayTV #VijayTelevision pic.twitter.com/ZdbtAolWH8— Vijay Television (@vijaytelevision) September 13, 2025