
బిగ్‌బాస్-9 తెలుగులోకి వైల్డ్ కార్ట్ ఎంట్రీకి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే కామనర్స్ విభాగం నుంచి దివ్య నిఖిత హౌస్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు మరో ఐదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. వారి పేర్లు కూడా సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్తవారు హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తుండటంతో బిగ్‌బాస్‌లో ఆట మరింత రణరంగంగా మారనుందని చెప్పవచ్చు.

సినీ నటుడు ప్రభాస్ శీను(Prabhas Sreenu) బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వెళ్తున్నారని తెలుస్తోంది. అక్టోబర్ 11,12 తేదీలలో వీరందరూ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. హీరో ప్రభాస్ తనకు మంచి స్నేహితుడు కావడంతో ఆయన పేరునే ట్యాగ్‌లైన్‌గా మార్చుకున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్‌లో సంఖ్య పెరగడంతో పాటు ఆట మరింత ఆసక్తిగా ఉండనుందని సమాచారం. బుల్లితెర నటుడు నిఖిల్ నాయర్(Nikhil Nair) కూడా బిగ్‌బాస్‌లోకి వెళ్లనున్నట్లు సమాచారం. భారీ కటౌట్‌తో ఉన్న నిఖిల్ సిరీయల్స్‌తో మెప్పించాడు. ఇంటింటి గృహలక్ష్మి, పలుకే బంగారమాయెనా సీరియల్స్‌తో గుర్తింపు పొందాడు.
అలేఖ్య చిట్టి పికిల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రమ్య(Ramya) కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. రీసెంట్‌గా అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ గురించి పెద్ద కాంట్రవర్సీ జరగడంతో ఆమె పేరు బాగా వెలుగులోకి వచ్చింది. దీంతో బిగ్‌బాస్ టీమ్ ఆమెతో సంప్రదింపులు జరిపారట. అందుకు ఆమె కూడా ఓకే చెప్పినట్లు టాక్.

లఘు చిత్రాలు, వెబ్ సీరిస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ రాజ్(Akhil Raj) కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ దాదాపు ఖాయం అయిపోయినట్లు సమాచారం. అయితే, సోషల్‌మీడియాలో అతనికి పెద్దగా గుర్తింపు లేదు. ఇలా బిగ్‌బాస్‌తో అందరికీ దగ్గరకావాలనే ప్లాన్ ఉన్నాడు. యూకేలో నివసిస్తున్న మౌనిషా చౌదరి(Mouneesha Chowdary) బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న మౌనీషా చౌదరి.. ప్రస్తుతం అమెరికాలోని ఉతాలో ఉంటుంది. 2016లో 'మిస్ ఆసియా ఉతా'గా కిరీటం గెలుచుకుంది. స్నో అక్కగా గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు ఇన్ స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కొద్దిరోజుల క్రితం అమెరికా వెళ్లిన మంచు విష్ణుతో కలిసి 'కన్నప్ప' టూర్‌లో పాల్గొంది. సినిమాను ప్రమోట్ కూడా చేసింది.