Bigg Boss Telugu 6: ఫుల్‌ ఖుషీలో కీర్తి, ఇనయ.. శ్రీహాన్‌కు డబుల్‌ ధమాకా!

Bigg Boss 6 Telugu: Inaya, Keerthi, Shrihan Full Happy After Family Visit - Sakshi

Bigg Boss Telugu 6, Episode 82: పన్నెండు వారాల ఎడబాటుకు తెర దించుతూ కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపుతున్నాడు బిగ్‌బాస్‌. వారిని చూసి గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటున్నారు హౌస్‌మేట్స్‌. తమ వాళ్లను చూడగానే తెలియకుండానే కన్నీళ్లు కార్చుతున్నారు. వారితో కలిసి చిందులేస్తున్నారు. మరి ఈరోజు ఎపిసోడ్‌లో ఏయే కంటెస్టెంట్ల ఫ్యామిలీస్‌ వచ్చాయో చూద్దాం..

పన్నెండు వారాల తర్వాత ప్రేయసి కళ్లముందుకు రావడంతో భావోద్వేగానికి లోనయ్యాడు శ్రీహాన్‌. హౌస్‌లోకి వెళ్లగానే శ్రీహాన్‌ను గట్టిగా పట్టుకుని అతడిపై ముద్దుల వర్షం కురిపించింది సిరి. ఈ పదేళ్లు నా వెనకుండి నువ్వెలా నడిపించావో, భవిష్యత్తు అంతా కూడా నువ్వ నాతోనే ఉండాలంటూ తన పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నానని మెడపై ఉన్న టాటూ చూపించింది. తర్వాత సిరి కొడుకు చైతూ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశాడు.

వచ్చీరాగానే ఈ చిచ్చరపిడుగు తన బుల్లిబుల్లి మాటలతో అందరినీ నవ్వించాడు. ఎవరెలా మాట్లాడతారో వారి డైలాగులను సరిగ్గా దింపేశాడు. తర్వాత.. ఇంతందం దారి మళ్లిందా.. పాటకు సిరి, శ్రీహాన్‌ స్టెప్పులేశారు. వారిద్దరి మధ్యలో చైతూ వచ్చేందుకు ప్రయత్నించడంతో పానకంలో పుడకలా వస్తావేంట్రా అని తిట్టలేక నవ్వుకున్నాడు శ్రీహాన్‌. చివరగా వెళ్లిపోయేముందు శ్రీహాన్‌ పాదాలు తాకి వీడ్కోలు తీసుకుంది సిరి.

ఇక రాత్రిపూట కడుపులో మండుతుందని పాలు అడిగాడు రాజ్‌.. ఎప్పటిలాగే స్ట్రిక్ట్‌ మాస్టర్‌ రేవంత్‌ కుదరదని తెగేసి చెప్పాడు. అడిగినప్పుడు ఇవ్వడానికి ఏం ప్రాబ్లమ్‌ అని లోలోనే గునుక్కున్నాడు రాజ్‌. తర్వాతి రోజు కీర్తి కోసం ఆమె స్నేహితుడు, బుల్లితెర నటుడు మహేశ్‌ వచ్చాడు. ఆమెతో కలిసి డ్యాన్స్‌ చేసి గోరుముద్దలు తినిపించాడు. 

ఎవ్వరూ కోల్పోలేనిది నువ్వు కోల్పోయావు. కానీ ఆ దేవుడు నీకు ఇచ్చిన ఛాన్స్‌ బిగ్‌బాస్‌. ఇక్కడ నీతో నీకే పోటీ.. లక్షల మంది సైన్యం నీ వెంట ఉన్నారు.. అదే నీ బలం.. అంటూ ఆమెలో పాజిటివిటీ నింపాడు. తను  దత్తత తీసుకున్న పాప ఫొటోను బహుమతిగా అందించాడు. అయితే ఆమెను కాపాడుకోలేకపోయానని బోరున ఏడ్చింది కీర్తి. అనంతరం మహేశ్‌.. ఇనయను ముద్దుపెట్టమని అడగడంతో అందరూ సర్‌ప్రైజ్‌ అయ్యారు. అతడికి నో చెప్పడం ఇష్టం లేని ఇనయ ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చింది.

అనంతరం ఇనయ సుల్తాన తల్లి నజ్బూర్‌ హౌస్‌లోకి వచ్చింది. ఆమెను చూడగానే ఎమోషనలైంది ఇనయ. 'నాకోసం నువ్వు మనసులో ఇంత బాధపడుతున్నావని తెలీదు, అందుకే వచ్చాను. నీ జీవితం నువ్వు చూసుకున్నావు, ఇంత కష్టపడ్డావు. బిగ్‌బాస్‌కు వచ్చావు. గెలిచి రావాలి. నువ్వు బాగుండాలనేదే నా కోరిక' అని చెప్పింది. హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయిపోదాం అని ఇనయ అడిగితే అది తర్వాత మాట్లాడుకుందాం, ముందైతే బాగా ఆడి గెలిచి రా అని బదులిచ్చింది. 

కేజీఎఫ్‌లోని అమ్మ సాంగ్‌ వేయడంతో తల్లి కాళ్ల మీద పడి ఏడ్చింది ఇనయ. అనంతరం ఆమె అక్కడి నుంచి వీడ్కోలు తీసుకుంది. తల్లిని బిగ్‌బాస్‌ హౌస్‌లో చూడాలన్న తన కల నెరవేరడంతో ఇనయ తెగ సంతోషపడిపోయింది.

చదవండి: ఇనయను, ఆమె తల్లిని కలిపిన బిగ్‌బాస్‌
భారత ఆర్మీని అవమానించిందంటూ నటిపై ట్రోలింగ్‌

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

24-11-2022
Nov 24, 2022, 16:23 IST
'జీవితంలో చాలా కోల్పోయావు, ఆ దేవుడు నీ నుంచి ఎన్నో తీసేసుకున్నాడు. కానీ అదే దేవుడు నీకు మళ్లీ ఇంకో...
24-11-2022
Nov 24, 2022, 15:27 IST
హౌస్‌లోకి వచ్చిన సిరిని చూసి ఏడుస్తూనే కన్ను కొట్టాడు శ్రీహాన్‌. నీకోసం ఓ సర్‌ప్రైజ్‌ అంటూ వెనక్కు తిరిగి మెడ...
23-11-2022
Nov 23, 2022, 23:35 IST
ఫిజియోథెరపీ ఆపేశారు. ఎవరూ సాయం చేయట్లేదని అర్థమైంది. వాళ్ల దగ్గర తినడానికి సరిపడా డబ్బులున్నాయి. కానీ చికిత్సకు సరిపేడంత లేవు అని ఏడ్చింది. అనంతరం...
23-11-2022
Nov 23, 2022, 20:19 IST
షోలోకి వెళ్లకముందే వాళ్ల అమ్మకి చీర కొనిచ్చి దాన్ని కట్టుకురమ్మని చెప్పింది. సడన్‌ ఎలిమినేషన్‌ మేమంతా కూడా ఎక్స్‌పెక్ట్‌ చేయలేకపోయాం....
23-11-2022
Nov 23, 2022, 19:26 IST
'కొన్ని సంతోషకరమైన క్షణాలను మాటల్లో చెప్పలేం. ఈ ఆనందం కలకాలం అలాగే నిలిచిపోతుందని భావిస్తున్నాను' అని క్యాప్షన్‌ జోడించాడు..
23-11-2022
Nov 23, 2022, 16:41 IST
ఈరోజు శ్రీసత్య, ఫైమా, రోహిత్‌ తల్లి హౌస్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. రోహిత్‌ను సర్‌ప్రైజ్‌ చేయాలని...
23-11-2022
Nov 23, 2022, 14:08 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లోని కంటెస్టెంట్స్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ వస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్‌లో ఆదిరెడ్డి భార్య, కూతురితో పాటు రాజ్‌ వాళ్ల తల్లి...
23-11-2022
Nov 23, 2022, 09:02 IST
Bigg Boss-6 Telugu, Episode 80 Highlights : బిగ్‌బాస్‌ సీజన్‌-6లో హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యామిలీ...
22-11-2022
Nov 22, 2022, 15:41 IST
బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ చూస్తుండగానే పదకొండు వారాలు ముగించుకొని 12వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం హౌజ్‌లోకి కంటెస్టెంట్స్‌ ఫ్యామిలీ...
21-11-2022
Nov 21, 2022, 23:24 IST
నా బెస్ట్‌ఫ్రెండ్స్‌ను నమ్మి అన్ని విషయాలు షేర్‌ చేసుకుంటాను. అయితే నేను వాళ్లను క్లోజ్‌ అనుకునే కన్నా వాళ్లు నన్నెంత...
21-11-2022
Nov 21, 2022, 20:36 IST
11 వారాలుగా ఇంట్లో అందరి ఆకలి తీర్చి మదర్‌ ఇండియాగా పేరు తెచ్చుకుంది మెరీనా. కయ్యానికి కాలు దువ్వకుండా అందరితో...
21-11-2022
Nov 21, 2022, 18:11 IST
వెంటనే శివ అందుకుంటూ నేను ఆడగలా? లేదా? అని కూడా ఆలోచించారా? అని వెటకారంగా నవ్వాడు. మీరు ఎంత కోపం తెప్పించినా...
21-11-2022
Nov 21, 2022, 17:01 IST
ఇతర కంటెస్టెంట్ల సపోర్ట్‌తోనే మీరు కెప్టెన్‌ అయ్యారు కదా, మరి నాకెవరూ సపోర్ట్‌ చేయలేదు, సోలో ప్లేయర్‌ అని ఎందుకంటారు?...
21-11-2022
Nov 21, 2022, 15:39 IST
రేషన్‌ సేవ్‌ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నావు కానీ కడుపులు నిండాలని ఆలోచించట్లేదు అని ఫైర్‌ అయ్యాడు.
21-11-2022
Nov 21, 2022, 10:06 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6 కంటెస్టెంట్‌ నేహా చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా నేహానే వెల్లడించింది. అంతేకాకుండా కాబోయే...
20-11-2022
Nov 20, 2022, 23:19 IST
ఆదిరెడ్డి తనలో తానే మాట్లాడుకోవడం చూసి దెయ్యంతో మాట్లాడుతున్నాడేమో అనుకునేదాన్ని, ఆ తర్వాత క్లారిటీ వచ్చిందని పేర్కొంది. అతడితో ఉంటే...
20-11-2022
Nov 20, 2022, 22:17 IST
అందరికీ వంట చేసి పెడుతూ, నవ్వుతూ పలకరిస్తూ స్నేహంగా మెదిలింది. పెద్దగా ఎవరితోనూ గొడవలు పెట్టుకోలేదు. కానీ అదే ఆమెకు...
20-11-2022
Nov 20, 2022, 17:42 IST
రాజ్‌కు దెయ్యాలంటే భయమన్న విషయాన్ని బయటపెట్టాడు నాగ్‌. ఈరోజు మెరీనా, శ్రీసత్య, ఫైమా. దెయ్యాల వేషం వేసుకుని రాజ్‌ను భయపెట్టాలన్నాడు....
20-11-2022
Nov 20, 2022, 16:33 IST
మరి వీరిలో ఎవరు బాటమ్‌ 5లో ఉంటారో హౌస్‌మేట్స్‌ అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాడు నాగ్‌. ఈమేరకు రిలీజైన ప్రోమోలో ఒక్కొక్కరు...
20-11-2022
Nov 20, 2022, 15:28 IST
బాలాదిత్య ఆఫ్ట్రాల్‌ సిగరెట్‌ కోసం అంత గొడవపడ్డా అతడికే మద్దతు పలికారు ఫ్యాన్స్‌. బదులుగా గీతూను బయటకు పంపించి తగిన...

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top