Bigg Boss Telugu 6: Baladitya Becomes First Captain And Geetu Sent Jail | Bigg Boss 6 Telugu Episode 6 Highlights - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: గేమ్‌ కోసం ఏం చేయడానికైనా రెడీ అన్న గీతూ.. జైలుకి పంపిన హౌస్‌మేట్స్‌

Sep 10 2022 9:05 AM | Updated on Sep 10 2022 11:33 AM

Bigg Boss 6 Telugu: Baladitya Becomes First Captain And Geetu Sent Jail - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-6 మొదటి కెప్టెన్‌గా బాలాదిత్య గెలిచాడు. కెప్టెన్సీ టాస్కులో భాగంగా నీళ్లలొ వేసిన తాళం చెవిని నోటితో తీసి, వాటితో బాక్సులను ఓపెన్ చేసి, అందులో ఉన్న కారు నెంబర్ ను చూడాలి. ఆ నెంబర్ ప్లేటులోని అక్షరాలు, నెంబర్లను వెతికి కార్లకు అతికించాలి. ఈ టాస్కులో మెరీనా అండ్‌ రోహిత్‌, నేహా చౌదరి, గీతూ రాయల్‌,బాలాదిత్య, ఆర్జే సూర్య, ఆదిరెడ్డిలు పోటీపడగా చివరికి బాలాదిత్య విజేతగా నిలిచాడు. ఇక ఆ తర్వాత ఇంట్లో అసలు రచ్చ మొదలైంది. ఈ కెప్టెన్సీ టాస్కులో వరస్ట్‌ పర్ఫార్మర్‌ ఎవరో చెప్పాలని బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులను ఆదేశించాడు.

ఇందులో రేవంత్‌ గీతూని నామినేట్‌ చేయాలనుకున్నట్లు భావించినా ఆమెకు పీరియడ్స్‌ కావడంతో జైలుకు పంపడం ఇష్టం లేదని, దీంతో ఆదిరెడ్డిని నామినేట్‌ చేశాడు. ఇక సుదీప గీతూకి గట్టిగానే ఇచ్చిపడేసింది. ‘నాకు నచ్చినట్టు నేనుంటా, నేను నా ఇంట్లో ఉండే ఎవరూ ఒప్పుకోరు’ అని చెప్పి ముఖంపై రెడ్ మార్క్ వేసింది. చలాకీ చంటి కూడా గీతూకే ఓటేశారు. ఆ తర్వాత రాజశేఖర్, ఇనయా. శ్రీసత్య, ఆరోహి, ఆర్జే సూర్య, వాసంతి, నేహా, మెరీనా జంట, అర్జున్‌లు గీతూకే వరస్ట్ పెర్ఫార్మర్‌గా ఓటేశారు.

అయితే గీతూ మాత్రం తను చేసిందే కరెక్ట్‌ అంటూ సమర్థించుకుంది. అంతేకాకుండా గేమ్‌ కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నానని, ఇంట్లో ఒకవేళ తన పేరెంట్స్‌ని తీసుకొచ్చినా వాళ్లని వెనక్కినెట్టి తాను గెలవాలని కోరుకుంటానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా బిగ్‌బాస్‌లో ఉన్నంతమాత్రానా మీరంతా నా ఫ్యామిలీ కాదు. జస్ట్‌ కో పార్టిసిపెంట్స్‌ అంటూ ఇతర కంటెస్టెంట్లని ఉద్దేశించి గీతూ తన ఓపీనియన్‌ చెప్పింది.

ఇక హస్‌మేట్స్‌లో దాదాపు ఎక్కువ ఓట్లు గీతూకే వచ్చినందుకు చివరికి ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆమెకు పీరియడ్స్‌ ఉండటంతో ఈ ఒక్కసారికి ఆమెను క్షమించాలని బాలాదిత్య రిక్వెస్ట్‌ చేసినా బిగ్‌బాస్‌ నుంచి ఆదేశాలు రాకపోవడంతో గీతూని జైలుకి పంపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement