Bigg Boss Telugu 5: నటరాజ్ మాస్టర్ పారితోషికం ఎంతో తెలుసా?

Bigg Boss Telugu 5, Natraj Master Remuneration: 19 మంది సెలబ్రిటీలతో గ్రాండ్‌గా మొదలైంది బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్. చూస్తుండగానే షో నాలుగువారాలు పూర్తి చేసుకోగా నలుగురు హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. వీరిలో సరయూ ఫస్ట్ వీక్‌లోనే తిరుగుముఖం పట్టగా ఉమాదేవి రెండోవారానికే తట్టాబుట్టా సర్దుకుంది. తర్వాతివారంలో లేడీ అర్జున్‌రెడ్డి లహరి షారి షో నుంచి బయటకు వచ్చేసింది. తాజాగా నటరాజ్ మాస్టర్ షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఇంత త్వరగా బిగ్‌బాస్ హౌస్‌లో నుంచి బయటకు వచ్చేస్తున్నందుకు ఓ పక్క బాధగా ఉన్నప్పటికీ, గర్భంతో ఉన్న భార్య దగ్గరకు వెళ్తున్నందుకు మరోపక్క సంతోషపడ్డాడు మాస్టర్.
ఇదిలా వుంటే నటరాజ్ మాస్టర్‌కు బిగ్‌బాస్ షో నుంచి ఎంత ముట్టిందన్నది చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం.. మాస్టర్‌కు రోజుకు ఇంచుమించు 15 వేల రూపాయలు ఇస్తామని డీల్ కుదర్చుకున్నారట! ఈ లెక్కన అతడు వారానికి లక్ష రూపాయల పైచిలుకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ హౌస్‌లో అతడు నాలుగు వారాలున్నాడు, అంటే ఈ షో ద్వారా అతడు నాలుగు లక్షల పైనే వెనకేసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే అతడు షోలో అందించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ను పరిగణనలోకి తీసుకుని బిగ్‌బాస్ నిర్వాహకులు ముందుగా అనుకున్న డీల్ కన్నా కూడా ఎక్కువ పారితోషికం ఇచ్చే అవకాశం ఉందంటున్నారు నెటిజన్లు!