నీతో రిలేష‌నే వ‌ద్దు: తేల్చేసిన అఖిల్‌

Bigg Boss 4 Telugu: Avinash Says Monal Not Deserve This Show - Sakshi

పోయిన‌సారి నామినేష‌న్ అఖిల్‌, అభిజిత్ మ‌ధ్య చిచ్చు పెడితే ఈసారి మాత్రం అఖిల్ మోనాల్ మ‌ధ్య అగాధాన్ని సృష్టించింది. ఇద్ద‌రి ఫ్రెండ్‌షిప్ క‌ట్ట‌య్యేవ‌ర‌కు వ‌చ్చిందీ ప‌రిస్థితీ. అఖిల్ కోసం కూడా త్యాగానికి సిద్ధ‌ప‌డ‌ని మోనాల్ చివ‌రికి కెప్టెన్ వ‌ల్ల అభిజిత్ కోసం నామినేష‌న్‌లోకి వ‌చ్చింది. మ‌రోవైపు ఎప్ప‌టిలాగే అవినాష్ నామినేష‌న్‌ను త‌ట్టుకోలేక‌పోయాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వాల్సిందేనా అంటూ చిందులు తొక్కాడు. మ‌రి నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్ ఎలా సాగిందో తెలియాలంటే ఈ స్టోరీని చ‌దివేయండి..

కిచెన్‌లో అభిజిత్ క‌ష్టాలు
వంట రాదంటూ ఇన్నాళ్లు త‌ప్పించుకు తిరిగిన అభిజిత్ లాస్య వేసిన బిగ్‌బాంబ్ వ‌ల్ల కిచెన్‌లో దూరాడు. 20 దోశెలైనా ఆవురావురుమంటూ తినే సోహైల్‌తో క‌లిసి దోశెలు వేశాడు. అది చూసిన సోహైల్ దోశె వేయ‌‌మంటే అభిజిత్ ప‌రోటా చేస్తున్నాడ‌‌ని ఆట‌ప‌ట్టించాడు. ఇజ్జ‌త్ కా స‌వాల్‌.. ఇప్పుడు చేస్తా చూడంటూ మ‌రోసారి దోశె వేసేందుకు ప్ర‌య‌త్నించిన అభి ఈసారి ఏకంగా ఊత‌ప్పం చేశాడు. మ‌రోవైపు కొద్ది రోజులుగా డ‌ల్ అయిన అఖిల్‌.. 'నా జీవితంలో ముందు నుంచీ ట్ర‌స్ట్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకే నీతో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడ‌తా. నీ వ‌ల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నా, నీతో అటాచ్‌మెంటే వ‌ద్దు' అంటూ రిలేష‌న్‌కు క‌టీఫ్ చెప్ప‌డంతో మోనాల్ కంట‌త‌డి పెట్టుకుంది. (చ‌ద‌వండి: సోహైల్‌ అర్ధ‌రాత్రి అమ్మాయిల‌తో ఛాటింగ్ చేస్తాడు)

ఫ‌స్ట్ రౌండ్‌లో సోహైల్‌, మోనాల్ సేవ్‌
త‌ర్వాత అవినాష్‌ను అరియానా అంకుల్ అని పిల‌వ‌గా సోహైల్, అఖిల్ మ‌ధ్య‌లో దూరి అవినాష్‌ను ఏడిపించారు. అవినాష్‌కు ఈపాటికే పెళ్లి అయితే న‌లుగురు పిల్ల‌లుండేవారంటూ ఆట ప‌ట్టించారు. అనంత‌రం ప‌న్నెండోవారానికి గానూ నామినేష‌న్ ప్ర‌క్రియ మొద‌లైంది. బ‌జ‌ర్ మోగ‌గానే ఇంటి స‌భ్యులు ప‌రుగెత్తుకెళ్లి త‌ల‌పై టోపీ పెట్టుకున్నారు. గ్రీన్ టోపీలు ధ‌రించిన సోహైల్‌, మోనాల్ సేవ్ అవ‌గా ఎర్ర టోపీలు ధ‌రించిన అరియానా, అఖిల్‌, అభిజిత్‌, అవినాష్ నామినేట్ అయ్యారు. ఈ న‌లుగురు శ‌వ పేటిక‌లో నిల‌బడ‌టంతో రెండో లెవ‌ల్ ప్రారంభమైంది. ఇందులో నామినేట్ అయిన‌వారు సేఫ్ అయిన‌వారితో స్వాప్ చేసుకునే అవకాశాన్ని బిగ్‌బాస్ క‌ల్పించాడు. 

నువ్వు బిగ్‌బాస్ షోకు అన‌ర్హురాలివి
మొద‌ట‌గా అవినాష్ మాట్లాడుతూ.. నిన్న వీకెండ్‌లో నాక‌ర్థ‌మైంది నువ్వు ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంటో అంటూ సోహైల్‌ను స్వాప్ చేయ‌మ‌ని అభ్య‌ర్థించగా అత‌డు అందుకు ఒప్పుకోలేదు. త‌ర్వాత మోనాల్‌తో మాట్లాడుతూ.. నీ క‌న్నా నేను స్ట్రాంగ్‌, ఎప్పుడూ వ‌ర‌స్ట్ ప‌ర్ఫామెన్స్ అనిపించుకోలేదు. బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్తున్నా నీ క‌న్నా 200 % బాగా ఆడుతున్నాను.. నువ్వు కేవ‌లం మూడు వారాల నుంచి ప‌ర్ఫామెన్స్ చేసి క‌ప్పు గెలుస్తా అంటే కుద‌రదు. ఈ షోకు నువ్వు అన‌ర్హురాలివి అని గ‌ర‌మ‌య్యాడు. నేను అర్హురాలినో కాదో చెప్ప‌డానికి నువ్వు బిగ్‌బాస్ కాదు అని ఆమె కౌంట‌రిచ్చింది. నువ్వు స్ట్రాంగ్ అనుకున్న‌ప్పుడు ఇంకా భ‌య‌మెందుకు? నామినేష‌న్‌లో ఉండు అని తేల్చి చెప్పింది. (చ‌ద‌వండి: ఆ అల‌వాటు మాత్రం పోలేదు: హారిక త‌ల్లి)

అఖిల్‌- మోనాల్ మ‌ధ్య రాజుకున్న గొడ‌వ‌
త‌ర్వాత అఖిల్ మోనాల్‌ను త‌న‌కోసం నామినేష‌న్‌లోకి ర‌మ్మ‌ని కోర‌గా ఆమె అందుకు ఒప్పుకోలేదు. 'న‌న్ను ఎలిమినేట్ చేయాల‌న్న‌ప్పుడు ట‌పీమ‌ని నా పేరు చెప్పావు. కానీ కెప్టెన్సీలో మాత్రం నాకు స‌పోర్ట్ చేయ‌లేదు. నేను నీ కోసం బ‌ట్ట‌లు, వ‌స్తువులు అన్నీ త్యాగం చేశాను. స‌పోర్ట్ చేస్తావ‌నుకున్నా. కానీ చేయ‌లేదు. ఇప్ప‌టికీ చేయ‌ట్లేదు!' అని చెప్పుకొచ్చాడు. నేను స్ట్రాంగ్ అని నిరూపించుకునేందుకే కెప్టెన్సీ టాస్క్‌లో హారిక‌కు స‌పోర్ట్ చేసి ఆడాను అని మోనాల్ స‌మాధాన‌మిచ్చింది. అలా ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ రాజుకోవ‌డంతో అటు మోనాల్‌, ఇటు అఖిల్ బాధ‌ప‌డ్డారు. వీళ్లిద్ద‌రినీ చూసి సోహైల్‌కు మ‌రింత బాధేసింది. దీంతో‌ నీకోసం నామినేష‌న్‌లోకి వెళ్తాన‌ని అఖిల్‌తో చెప్పినప్ప‌టికీ అత‌డు దానికి అంగీక‌రించ‌లేదు.

మ‌న‌సులోని మాట చెప్పిన అభిజిత్‌
అరియానా వంతు రాగా..  ఈ సారి నీ సాయం కావాలంటూ సోహైల్‌ను కోర‌గా అత‌డు స‌సేమీరా నిరాక‌రించాడు. నీక‌న్నా నేను బెస్ట్ ప‌ర్ఫామెన్స్ ఇస్తున్నాను అని మోనాల్‌తో చెప్పుకు రాగా ఆమె మాత్రం స్వాప్ అవ‌న‌ని తేల్చి చెప్పింది. ఇక్క‌డ అరియానాకు మోనాల్‌కు మ‌ధ్య వాడివేడిగా చ‌ర్చ జ‌రుగుతుంటే అవినాష్ మ‌ధ్య‌లో దూరి ఈ చ‌ర్చ‌ను గొడ‌వ‌గా మార్చాడు. త‌ర్వాత అభిజిత్ మాట్లాడుతూ.. మీ అమ్మ వ‌చ్చి నన్ను ఫేవరెట్ అని చెప్పిన మాట నా మ‌నసును తాకింది. కాబ‌ట్టి నాకోసం నిన్ను త్యాగం చేయ‌మ‌ని అడ‌గ‌ను అని మోనాల్‌కు మ‌న‌సులోని మాట చెప్పాడు. ఎవ‌రూ స్వాప్‌కు ఒప్పుకోక‌పోవ‌డంతో అవినాష్ తెగ ఫ్ర‌స్టేట్ అయ్యాడు. ఇప్పుడు బాగా ఆడే కంటెస్టెంటు ఎలిమినేట్ అయి ఇంట్లో వెళ్లి కూర్చోవాలా అని ఆవేశ‌ప‌డ్డాడు. దీంతో అభి స్పందిస్తూ ఈ న‌లుగురిలో నువ్వు బాగా ఆడ‌క‌పోతే ఎలిమినేట్ అవుతావు త‌ప్ప అదృష్టం లేక కాదు అని క్లారిటీ ఇచ్చాడు.

హారిక మీద భారం వేసిన బిగ్‌బాస్‌
వీళ్ల గొడ‌వ‌కు చెక్ పెడుతూ బిగ్‌బాస్ పెద్ద ట్విస్టు ఇచ్చాడు. కెప్టెన్ హారిక త‌న ప‌వ‌ర్‌ ఉప‌యోగించి ఒక స్వాప్ చేయాల‌ని బాధ్య‌త అప్ప‌జెప్పాడు. దీంతో హారిక నీకోసం నేనున్నా అంటూ అభిజిత్‌ను సేవ్ చేస్తూ త‌న‌కు కెప్టెన్సీ ఫ‌లాన్ని అందించిన మోనాల్‌ను నామినేష‌న్‌లోకి పంపించింది. దీంతో త‌న‌కు సేవ్ అయ్యే అవ‌కాశం వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి చేజారింద‌ని మోనాల్ ఏడ్చేసింది. అటు హారిక కూడా త‌న‌కు స్వాప్ చేయ‌క త‌ప్ప‌లేద‌ని ఎమోష‌న‌ల్ అయింది. మొత్తానికి ఈ వారం అవినాష్‌, అఖిల్‌, అరియానా, మోనాల్ నామినేట్ అయ్యారు. (చ‌ద‌వండి: ఈ ఇద్ద‌రిలో ఒక‌రే బిగ్‌బాస్ విజేత‌: కౌశ‌ల్)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top