దుర్గామతి ట్రైలర్‌ విడుదల

Bhoomi Padnekaar Playing Leadrole in Dhurgamathi - Sakshi

ప్రధాన బలంగా భూమి నటన  

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన అనుష్క 'భాగమతి' ఇప్పుడు హిందీలో రీమెక్‌ చేశారు. ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. హిందీ రీమెక్‌లో ప్రధాన పాత్ర పోషించిన భూమి  పడ్నేకర్ తన ట్విటర్‌ వేదికగా సినీ ప్రమోషన్‌ను మొదలుపెట్టింది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియోలో.. భూమి నటన విపరీతంగా ఆకట్టుకుంటోంది. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలుస్తోంది. ఈ సినిమా మొదటి నుంచి వివాదాల్లో ఉంది. ముందుగా ఈ సినిమా టైటిల్‌గా 'దుర్గావతి' అని ప్రకటించారు. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఈ చిత్రం పేరును 'దుర్గామతి' గా మార్చారు.  'మాతృకను ' రూపొందించిన డైరెక్టర్ అశోక్‌  సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

'టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ' తర్వాత అక్షయ్‌ నిర్మించిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా డిసెంబరు 11న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా విడుదల కానుంది. తెలుగులో అనుష్క నటన ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. ‘ఎవరు పడితే వారు రావడానికి ఇది పశువుల దొడ్డా.. భాగమతి అడ్డా' అని ఆమె చెప్పే డైలాగ్స్‌కి అభిమానుల కేరింతలతో థియేటర్లు దద్దరిల్లాయి. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలవుతున్న  ‘దుర్గామతి’ఇప్పుడు ప్రేక్షకులను ఎంతమేరకు అలరించనుందో వేచిచూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top