‘బాహుబలి: ది ఎపిక్‌’ ట్విటర్‌ రివ్యూ | Baahubali: The Epic Re-Release Gets Massive Response | Prabhas, Rajamouli Shine Again | Sakshi
Sakshi News home page

Baahubali The Epic X Review: రివ్యూ ఇచ్చిన మహేశ్‌ బాబు కొడుకు.. థియేటర్స్‌లో చూడాల్సిందే!

Oct 30 2025 2:12 PM | Updated on Oct 30 2025 2:52 PM

Baahubali : The Epic Twitter Review And Public Talk

ఇండియన్సినిమా హిస్టరీలోబాహుబలిఒక చరిత్ర. మూవీ తొలిభాగం 2015లో రిలీజై బ్లాక్బస్టర్హిట్గా నిలవడమే కాదు.. పాన్ఇండియా చిత్రాలకు పునాదిని వేసింది. ఇక బాహుబలి 2 సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు రెండు చిత్రాలు కలిపిబాహుబలి: ది ఎపిక్‌’(Baahubali: The Epic ) పేరుతో అక్టోబర్‌ 31 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక్క రోజు ముందే విదేశాల్లో చిత్రం సందడి చేస్తోంది. ఓవర్సీస్లో చిత్రం రోజే రిలీజైంది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.

(చదవండి: ‘బాహుబలి’కి డిజాస్టర్‌ టాక్‌..నిర్మాత బలి అన్నారు: రాజమౌళి)

బాహుబలి ది ఎపిక్' విజువల్ వండర్ అని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. రీరిలీజ్అయినప్పటికీ..తెరపై చూస్తుంటే ఒక కొత్త చిత్రం చూసినట్లుగానే ఉంటుందని చాలా మంది అంటున్నారు. రాజమౌళి చాలా అద్భుతంగా ఎడిట్చేశారని..క్వాలిటీ అదిరిపోయిందని కామెంట్స్పెడుతున్నారు. సినిమాలో ప్రధానమైన సన్నివేశాలకు సంబంధించిన వీడియో క్లిప్పులను ఎక్స్లో షేర్చేస్తూమిస్కాకుండా చూడండిఅని కామెంట్స్చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ఎంట్రీ సీన్‌.. తల నరికే సన్నివేశాలను బాగా వైరల్చేస్తున్నారు. సూపర్స్టార్మహేశ్బాబు తనయుడు గౌతమ్ఘట్టమనేని సైతం సినిమాపై ప్రశంసలు కురిపించారు.

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపేశాడో తెలుసుకోవడం కోసం ఇప్పుడు రెండేళ్లు వేచిచూడాల్సిన అవసరం లేదని... ఎడిట్‌ చేసిన తర్వాత ఈ చిత్రం మరింత అద్భుతంగా ఉందని గైతమ్అన్నారు. ‘ప్రతి సెకనుకు గూస్‌బంప్స్‌ వస్తున్నాయి. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. ‘బాహుబలి: ది ఎపిక్‌’ని చూడడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవంఅని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్చెప్పుకొచ్చాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement