సీనియర్ నటి, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌పై దాడి! | Sakshi
Sakshi News home page

Shakeela: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ షకీలాపై దాడి!

Published Sun, Jan 21 2024 7:16 PM

Attack On Telugu Bigg Boss Contestant By Her Relatives - Sakshi

సీనియర్ నటి, బిగ్‌బాస్‌ సీజన్‌-7 కంటెస్టెంట్‌ షకీలాపై దాడి జరిగింది. ఆమె పెంపుడు కుమార్తె శీతల్‌ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో షకీలా పోలీసులను ఆశ్రయించింది. కుటుంబ వ్యవహారాల విషయంలో మనస్పర్థలు తలెత్తడంతో శీతల్‌ నిన్న ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయిందని షకీలా తెలిపింది. మాట్లాడేందుకు పిలవగా.. తన తల్లిని వెంటపెట్టుకుని వచ్చిందని వెల్లడించింది. తాను సర్ది చెప్పందుకు యత్నించగా.. తనపైనే దాడికి పాల్పడిందని షకీలా ఫిర్యాదులో పేర్కొంది. 

(ఇది చదవండి: అందరికీ కనిపించే షకీలా.. తెర వెనుక కన్నీటి జీవితం తెలుసా?)

అంతే కాకుండా గొడవ  సమయంలో అక్కడే ఉన్న మహిళా లాయర్‌తో శీతల్‌ తల్లి అసభ్యకరంగా మాట్లాడిందని షకీలా ఆరోపించింది. మరోవైపు అదే పోలీస్‌ స్టేషన్‌లో షకీలాపై కూడా శీతల్‌ ఫిర్యాదు చేసింది. దీంతో ఇరువైపులా ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేస్తామని తెలిపారు. కాగా ఆమె షకీలా అన్న కుమార్తెనని సమాచారం. 

Advertisement
 
Advertisement