
కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్ ప్రేమలో పడ్డాడు. ఈమేరకు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఖైదీ సినిమాలో విలన్‌గా నటించిన అర్జున్ దాస్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఓజీ సినిమాలో ఆయన కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే, ఒక యంగ్ హీరోయిన్‌తో అర్జున్ దాస్ ప్రేమలో ఉన్నారని నెట్టింట వైరల్ అవుతుంది.
2017లో వచ్చిన ‘ఆక్సిజన్’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అర్జున్ దాస్.. మాస్టర్, విక్రమ్ చిత్రాలతో పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే, యంగ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lakshmi)తో ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారిద్దరూ కలిసి ఒక వెబ్ సిరీస్ కోసం పనిచేస్తుండగా ఈ ప్రచారం జరుగుతుంది. కానీ, అర్జున్ దాస్ ఖండించారు. ఆపై ఐశ్వర్య లక్ష్మి కూడా తామిద్దరం మంచి స్నేహితులమంటూ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ప్రచారం మాత్రం ఆగడం లేదు.

కొందరు మాత్రం నిప్పు లేనిదే పొగ రాదంటూనే వారి ప్రేమ నిజమేనంటూ చెప్పుకొస్తున్నారు. సరైన సమయం చూసి ప్రేమ గురించి అందరికీ తెలుపుతారంటూ పేర్కొంటున్నారు. బ్యాంకు ఉద్యోగిగా, రేడియో జాకీగా అర్జున్ దాస్ పనిచేయగా.. ఐశ్వర్య లక్ష్మి వైద్య విద్య పూర్తి చేశారు. ఐశ్వర్య లక్ష్మి తెలుగులో సత్యదేవ్‌తో గాడ్సే మూవీలో నటించారు. ప్రస్తుతం 'సంబరాల ఏటి గట్టు'లో సాయిధరమ్ తేజ్‌తో నటిస్తున్నారు. మట్టి కుస్తీ, కింగ్ ఆఫ్ కొత్త,పొన్నియిన్ సెల్వన్,థగ్ లైఫ్ వంటి భారీ చిత్రాల్లో ఆమె మెప్పించారు. కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన ఈ బ్యూటీ తమిళ ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేశారు.