కొన్ని పాత్రలు చేయాలంటే దమ్ముండాలి. అది మలయాళ హీరో అర్జున్ అశోకన్‌కు కావాల్సినంత ఉంది. అర్జున్ 'తలవర' సినిమా (Thalavara Movie)లో బొల్లి వ్యాధితో బాధపడే యువకుడిగా నటించాడు. ఈ వ్యాధి కారణంగా అనేక అవమానాలను ఎదుర్కొంటాడు. కుటుంబం నుంచి సమాజం వరకు తనకు ఎదురయ్యే అనుభవాల కథే తలవర. ఈ సినిమా మలయాళంలో ఆగస్టు 22న థియేటర్లలో విడుదలైంది.
రెండు నెలల తర్వాత ఓటీటీలో
వసూళ్లు పెద్దగా రాలేదు కానీ కంటెంట్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అఖిల్ అనిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీకి వచ్చింది. బుధవారం సడన్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యక్షమైంది. తెలుగు డబ్బింగ్ లేదు, కేవలం మలయాళ భాషలోనే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ఉన్నాయి. ఈ సినిమాలో రేవతి శర్మ హీరోయిన్‌గా నటించింది.
సినిమా
అశోకన్, దేవదర్శిని, అభిరామి రాధాకృష్ణన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కిలి, విజయానంద్ సంగీతం అందించారు. ఈ మూవీ రిలీజైన ఐదారు రోజులకే అక్కడ కల్యాణి ప్రియదర్శిని లోక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో తలవర సినిమా వెనకబడిపోయింది. తలవర కంటే ముందు అర్జున్ అశోకన్.. సుమతి వలవు సినిమాతో మెప్పించాడు. ఈ మలయాళ మూవీ దాదాపు రూ.25 కోట్లు రాబట్టింది.
#Thalavara (Malayalam)
Now streaming on Primevideo 🍿!!#OTT_Trackers pic.twitter.com/kgHjNAjL8h— OTT Trackers (@OTT_Trackers) October 29, 2025


