సాక్షి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తనపై ఎక్స్ (ట్విటర్)లో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారంటూ దయా చౌదరి అనే వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. ఇటీవల హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఇంకా ఇలాంటి పోస్టులు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
డీప్ ఫేక్ వీడియోలు
ఇటీవల చిరంజీవి డీప్ ఫేక్ ఫోటోలు, వీడియోలపై పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే! ఏఐ సాయంతో కొందరు ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు సృష్టించి.. వాటిని పలు వెబ్‌సైట్లలో వైరల్ చేశారు. దీనిపై ఆగ్రహించిన చిరు.. సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే కోర్టును సైతం ఆశ్రయించారు. చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు, వాయిస్‌ను ఎవరూ ఉపయోగించకూడదని సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
చదవండి: టాస్కుల్లో పవన్‌ను కొట్టేవాడే లేడు.. ఆస్పత్రిలో భరణి!


