ఆస్పత్రి నుంచి ఏఆర్‌ రెహమాన్‌ డిశ్చార్జ్‌ | AR Rahman Admitted to Hospital After Sudden Chest Pain | Sakshi
Sakshi News home page

AR Rahman: ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన ఏఆర్‌ రెహమాన్‌! కాసేపటికే డిశ్చార్జ్‌..

Published Sun, Mar 16 2025 10:04 AM | Last Updated on Sun, Mar 16 2025 3:18 PM

AR Rahman Admitted to Hospital After Sudden Chest Pain

సంగీత దిగ్గజం ఏఆర్‌ రెహమాన్‌ (A. R. Rahman) ఆస్పత్రిపాలయ్యాడు. ఆదివారం ఉదయం ఛాతీలో నొప్పి మొదలవడంతో చెన్నైలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వచ్చాయి. ప్రత్యేక వైద్య బృందం ఆయనకు ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్‌ వంటి పలు టెస్టులు నిర్వహించినట్లుగా కథనాలు వెలువడ్డాయి. దీనిపై రెహమాన్‌ కుమారుడు ఏఆర్‌ అమీన్‌ స్పందించాడు. డీహైడ్రేషన్‌ కారణంగా తన తండ్రి ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొన్నాడు. కొన్ని టెస్టులు చేశారని, అన్నీ నార్మల్‌గానే ఉండటంతో తనను డిశ్చార్జ్‌ చేశారని తెలిపాడు.

సినీ ప్రయాణం
ఏఆర్‌ రెహమాన్‌.. రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా ప్రయాణం ఆరంభించాడు. ఎన్నో హిట్‌ చిత్రాలకు బ్లాక్‌బస్టర్‌ సంగీతం అందించాడు. తెలుగులో గ్యాంగ్‌మాస్టర్‌, నీ మనసు నాకు తెలుసు, నాని, ఏ మాయ చేసావె, సాహసం శ్వాసగా సాగిపో వంటి చిత్రాలకు పని చేశాడు. ఇటీవల వచ్చిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ఛావాకు అద్భుతమైన సంగీతం అందించాడు. ప్రస్తుతం రామ్‌చరణ్‌-బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఈయనను ప్రభుత్వం.. పద్మ శ్రీ, పద్మ భూషణ్‌తో సత్కరించింది. స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ సినిమాకుగానూ రెండు ఆస్కార్లు అందుకున్నాడు. 

చదవండి: నా పక్కన హీరోయిన్‌గా నటించలేమన్నారు: సప్తగిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement