‘బిల్లా’లో నా బికినీపై మా అమ్మ చేసిన వ్యాఖ్యలకు షాకయ్యా..

Anushka Shetty Reveals Her Mother Reaction After Seeing Bikini In Billa Movie - Sakshi

ఇండస్ట్రీలో అనుష్క శెట్టి ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వీటీ అని ముద్దుగా పలుచుకునే ఈ బెంగళూరు భామ సూపర్‌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత విక్రమార్కుడు వంటి చిత్రాల్లో గ్లామరస్‌గా కనిపించిన అనుష్క.. తన మొదటి లేడీ ఓరియంటెడ్‌ చిత్రం ‘అరుంధతి’లో జేజమ్మగా ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో తన నటనకు వంద శాతం మార్కులు కొట్టెసింది అనుష్క. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ కావడంతో ఒక్కసారిగా స్వీటీ రేంజ్‌ అమాంతం పెరిగిపోయింది.

అప్పటి నుంచి తెలుగు, తమిళంలో అగ్రనటిగా రాణించిన ఆమె ప్రస్తుతం సినిమాలు తగ్గించి కేవలం లేడీ ఓరియంటెడ్‌ పాత్రలనే ఎంచుకుంటోంది. అయితే మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బిల్లా’ మూవీలో బికినీ వేసి అందాలు ఆరబోసిన స్వీటీ బయట మాత్రం చాలా సంప్రదాయంగా ఉంటుంది. ఏ మూవీ ఆడియో ఫంక్షన్‌ అయినా, ఇతర ఈవెంట్లు అయినా చీరలో లేక సల్వార్ కమీజ్‌లోనో కనిపిస్తుంది. స్వీటీ గ్లామరస్‌ పాత్రలు చేసినప్పటికి బిల్లాలో ఇంకాస్తా డోస్‌ పెంచి బికినీలో ఫిదా చేసింది. అయినప్పటికి అనుష్క పాత్రకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది.

అంతటి రేంజ్‌లో ఎక్స్‌పోజ్‌ చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన అనుష్కకు వ్యక్తిగతంగా అలాంటి దుస్తులు అంటే ఇష్టం ఉండవని ఇదివరకే పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల సైతం ఓ ఇంటర్వ్వూలో ఇదే విషయం మాట్లాడుతూ బిల్లాలో తన పాత్రను గుర్తుచేసుకుంది. ఇందులో తను బికినీ ధరించడంతో తన తల్లి చేసిన వ్యాఖ్యలు తనను ఆశ్చర్యపరిచాయని చెప్పింది. ‘మా అమ్మ నేను పద్దతిగా ఉండాలనుకుంటుంది. అది వ్యక్తిగతంగా అయినా వృత్తిపరంగా అయినా. అయితే బిల్లా సినిమా చూసిన తర్వాత మా అమ్మ నన్ను ఇంకా స్టైలిష్‌గా ఉండొచ్చు కదా.. సగం పద్దతిగా, సగం మోడ్రన్‌గా ఎందుకుంటావ్‌ అని అంది. అప్పుడు నేను షాక్‌ అయ్యాను. ఎందుకంటే తన నుంచి ఆ వ్యాఖ్యలు వస్తాయని నేను ఎప్పుడు ఊహించలేదు’ అంటూ స్వీటీ చెప్పుకొచ్చింది. 

చదవండి: 
నాని మూవీకి హ్యాండ్‌ ఇచ్చిన నజ్రీయా, షూటింగ్‌ వాయిదా!
Bandla Ganesh: తమిళ మూవీ రీమేక్‌, హీరోగా బండ్ల గణేశ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top