నిద్రలేని రాత్రులు గడుపుతున్నా! 

Animal star Tripti Dimri reveals how the film changed her life - Sakshi

‘యానిమల్‌’ సినిమాతో ఒక్కసారిగా ట్రెండింగ్‌ స్టార్‌ అయ్యారు బాలీవుడ్‌ బ్యూటీ త్రిప్తి దిమ్రీ. సోషల్‌ మీడియాలో ఆమెకు విపరీతమైన ఫాలోయర్స్‌ పెరిగిపోయారు. ఈ సడన్‌ స్టార్‌డమ్‌ గురించి త్రిప్తి దిమ్రీ స్పందిస్తూ– ‘‘ప్రేక్షకులు, అభిమానుల నుంచి నాకు లభిస్తున్న ప్రేమ ఆనందాన్నిస్తోంది. ఈ అనుభూతి ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. చెప్పాలంటే నా మొబైల్‌ ఫోన్‌ మెసేజ్‌లతో మోగుతూనే ఉంది.

చివరికి ఈ మెసేజ్‌ల వల్ల నేను నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తోంది. అన్ని వస్తున్నాయి. అవి చదువుతూ రాత్రి సమయాన్ని గడిపేస్తున్నాను. కానీ ఇది బాగుంది. ఇక రణ్‌బీర్‌ కపూర్‌ అమేజింగ్‌ యాక్టర్‌. చాలా సపోర్టివ్‌. రష్మికా మందన్నా కూడా చాలా కో–ఆపరేటివ్‌’’ అని చెప్పుకొచ్చారు. రణ్‌బీర్‌ కపూర్, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా, త్రిప్తి దిమ్రీ, బాబీ డియోల్, అనిల్‌ కపూర్‌ కీలక పాత్రల్లో సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘యానిమల్‌’ సినిమా ఈ నెల 1న విడుదలైన విషయం తెలిసిందే. సూపర్‌ హిట్‌ టాక్‌తో ఈ చిత్రం దూసుకెళుతోంది.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top