పెద్దల కోసం రెడీ అయిన 'పేద్ద' సినిమా.. కాకపోతే! | Animal Movie Runtime And Censor Details | Sakshi
Sakshi News home page

Animal Movie: రిస్క్ చేస్తున్న 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్.. సక్సెస్ అయితే మాత్రం!

Published Wed, Nov 22 2023 8:44 PM | Last Updated on Thu, Nov 23 2023 9:26 AM

 Animal Movie Runtime And Censor Details - Sakshi

ప్రస్తుతం సినిమా ప్రేక్షకుల ఇంట్రెస్ట్ పూర్తిగా మారిపోయింది. ల్యాగ్ ఉంటే అస్సలు లెక్క చేయట్లేదు. నిర్దాక్షిణ్యంగా ట్రోల్ చేసి పడేస్తున్నారు. దీంతో దర్శకనిర్మాతలు చాలావరకు తమ తమ సినిమాల్ని రెండున్నర గంటల నిడివికి కాస్త అటు ఇటు ఉండేలానే చూసుకుంటున్నారు. అలాంటిది ఓ స్టార్ డైరెక్టర్ పెద్ద రిస్క్ చేయడానికి రెడీ అయిపోయాడు. ఇప్పుడా విషయమే పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది.

'అర్జున్ రెడ్డి' పేరు చెప్పగానే చాలామందికి విజయ్ దేవరకొండ గుర్తొస్తాడు. మరికొందరికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గుర్తొస్తాడు. ఆ సందీప్.. ఇప్పుడు 'యానిమల్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తీసిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, కన్నడ బ్యూటీ రష్మిక హీరోహీరోయిన్లుగా నటించారు. గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమా మూడున్నర గంటల నిడివి రాబోతుందని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడదే నిజమైంది.

(ఇదీ చదవండి: Bigg Boss 7: శివాజీకి షాక్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరేనా?)

లేటెస్ట్‌గా 'యానిమల్' సెన్సార్ జరగ్గా.. సెన్సార్ బోర్డ్ 'ఏ' సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే ఈ సినిమా పెద్దలకు మాత్రమే. అలానే 201 నిమిషాల నిడివితో అంటే 3 గంటల 21 నిమిషాల మూవీ ఇది అని స్వయంగా దర్శకుడు సందీప్ రెడ్డినే సోషల్ మీడియాలో ప్రకటించాడు. అయితే సినిమాలో కంటెంట్ ఉంటే.. ఈ నిడివి అనేది అస్సలు సమస్యే కాదు. ఒకవేళ ఏమైనా తేడా కొడితే మాత్రం మొదటికే మోసపోయే ఛాన్స్ ఉంది.

అయితే సందీప్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే.. 'యానిమల్'తో ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తున్నాడు. గురవారం (నవంబరు 23) ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. అయితే ట్రైలర్ మాత్రం పెద్దలు-పిల్లల మాత్రం చూసేలా కట్ చేసినట్లు తెలుస్తోంది. అలానే పెద్ద సినిమా కాబట్టి రెండు ఇంటర్వెల్స్ ఉంటాయా? అనేది కూడా చూడాలి. ఒకవేళ నిడివితో సంబంధం లేకుండా ఈ మూవీ హిట్ అయితే మాత్రం సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసినట్లే! ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే డిసెంబరు 1 వరకు ఆగితే సరి!

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరోయిన్.. భర్త ఎవరంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement