జీవితంలో ఏదీ అంతా ఈజీ కాదు: హీరోయిన్ | Sakshi
Sakshi News home page

Andrea Jeremiah: ఇక్కడ ఇలా చేయడం ఇదే మొదటిసారి: ఆండ్రియా

Published Sun, Jun 18 2023 7:06 AM

Andrea Jeremiah Open About Career Struggles In Industry - Sakshi

సంచలన నటీమణుల్లో ఆండ్రియా ఒకరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈమె రాసలీలలు, ప్రేమలో పడడం, మోసపోవడం వంటి సంఘటనలు ఇప్పటికే మీడియాలో కథలు కథలుగా వెలువడిన విషయం తెలిసిందే. ఇక వివాదాస్పద కథా పాత్రల్లో నటించడం ఆండ్రియా తరువాతే ఎవరైనా అని చెప్పాలి. తన గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయడంలోనే ఈ భామ ముందే ఉంటారు. వీటితో పాటు మంచి నటి, గాయని అనే పేరు తెచ్చుకున్నారు.

(ఇది చదవండి: ఫాదర్స్‌ డే స్పెషల్‌: మంచి తండ్రులందరికీ శుభాకాంక్షలు)

అంతేకాకుండా ఆండ్రియాలో గీత రచయిత కూడా వున్నారు. ఇకపోతే షూటింగ్‌లు, పాటల రికార్డింగ్‌లు అంటూ బిజీగా వున్న ఆండ్రియా మధ్యలో సంగీత కచేరీలు చేస్తున్నారు. ఆ మధ్య కౌలాలంపూరులో తన సంగీత విభావరి కార్యక్రమాన్ని సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. ఆ ఉత్సాహంతో తాజాగా జులై 1న కోయంబత్తూరులో సంగీత కచేరి నిర్వహించబోతున్నారు.

దీని గురించి ఆమె కోయంబత్తూరులో మీడియాతో మాట్లాడుతూ జీవితంలో ఏది ఈజీ కాదని, ప్రతి విషయంలోనూ ఒక కష్టం ఉంటుందని పేర్కొన్నారు. తాను గతంలో 15 ఏళ్ల పాటు మ్యూజిక్‌ క్లాసులకు వెళ్లినట్లు చెప్పారు. అదే తనను ఇప్పుడు పాడేలా చేస్తుందని చెప్పారు. తను కోయంబత్తూరుకు చాలాసార్లు వచ్చానని.. కళాశాలలో చాలా షోలు చేశానని అయితే ఇక్కడ పబ్లిక్‌ మధ్య కచేరీ చేయడం ఇదే మొదటిసారి అని చెప్పారు. అయితే దీనిని పెద్ద విషయంగా తాను భావించడం లేదని అన్నారు. కాగా రాజకీయ రంగప్రవేశం చేసే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు ప్రస్తుతం కచేరీ గురించి మాట్లాడదాం అంటూ ఎస్కేప్‌ అయ్యారు.

(ఇది చదవండి: తమిళనాడులో ఆస్తులు ఉండేవి.. అన్నీ అమ్మేశా: సుధాకర్‌)

Advertisement
 
Advertisement
 
Advertisement