Amala Paul Second Marriage: రెండో పెళ్లి గురించి అమలాపాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Amala Paul Interesting Comments On Wedding - Sakshi

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందిన అమలాపాల్‌ ప్రస్తుతం వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఓటీటీలో అడుగుపెట్టిన ఆమె తెలుగులో కుడి ఎడమైతే, హిందీలో రంజిష్‌ హీ సహి అనే వెబ్‌సిరీస్‌లతో అలరించింది. సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో డైరెక్టర్‌ విజయ్‌ను పెళ్లాడింది. కానీ వీరి పెళ్లి బంధం ఎక్కువకాలం నిలవలేదు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. తాజాగా అభిమానులతో చిట్‌ చాట్‌ చేసిన అమలాపాల్‌ తన పెళ్లి గురించి ఓపెన్‌ అయింది.

మిమ్మల్ని వివాహం చేసుకోవాలంటే ఎలాంటి అర్హత ఉండాలి? అని ఓ నెటిజన్‌ ప్రశ్నించాడు. దీనికి హీరోయిన్‌ స్పందిస్తూ.. అసలిప్పుడు మరో పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం తనను తాను పూర్తిగా అర్థం చేసుకుని మరింత ఉన్నతంగా మార్చుకునే పనిలో ఉన్నానని బదులిచ్చింది. తనను మనువాడాలంటే ఎలాంటి క్వాలిటీస్‌ ఉండాలో ఇప్పుడైతే చెప్పలేనన్న ఈ బ్యూటీ త్వరలోనే దానికి బదులిస్తానని చెప్పుకొచ్చింది. అంటే అమలాపాల్‌ ప్రస్తుతం పెళ్లి మీద దృష్టి పెట్టలేదని తెలుస్తోంది.

చదవండి: ఆరేళ్ల రిలేషన్‌.. కానీ అప్పుడే మా ప్రేమ బలపడింది
మెగాస్టార్‌ కీలక నిర్ణయం.. ఇక అక్కడ కూడా రికార్డులు బద్దలే!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top